Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ నేతలపై వందల కేసులు నమోదయ్యాయి. స్టేట్ పోలీసులు పెట్టిన కేసులంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కొట్టేసుకోవచ్చు. కానీ రైల్వే కేసులపైనే నేతలకు ఇప్పటిదాకా భయముంది. ఎందుకంటే రైల్వే చట్టాలు వేరేగా ఉంటాయి. శిక్షలు కూడా కఠినంగా ఉంటాయి. పైగా ఏళ్ల తరబడి రైల్వే కేసుల్లో విచారణ జరగడంతో.. టీఆర్ఎస్ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతూనే ఉన్నాయి.
కానీ మౌలాలి కేసు నుంచి కేటీఆర్, నాయిని, పద్మారావుపై కేసు కొట్టేయడంతో గులాబీ పార్టీ రిలీఫ్ ఫీలైంది. ఇంత సుదీర్ఘంగా విచారించడంతో.. కొంపదీసి శిక్ష వేస్తారేమోనని క్యాడర్ ఆందోళన చెందినా.. ఢిల్లీ నేతలతో టచ్ లోకి వెళ్లిన కేసీఆర్ వారిని మచ్చిక చేసుకుని పని అయిందనిపించారు. కేంద్రంతో సఖ్యతకు ఇవి కూడా ఓ కారణమని ప్రత్యర్థులు విమర్శిస్తున్నా.. అందులో మాత్రం పాయింట్ ఉన్నట్లే అనిపిస్తోంది.
కానీ అప్పుడే పూర్తిగా రిలీఫ్ దక్కలేదు టీఆర్ఎస్ నేతలకి, ఇంకా ఖాజీపేట రైల్వే కేసు పెండింగ్ లో ఉంది. అక్కడ కూడా క్లీన్ చిట్ వస్తే ఇక కేటీఆర్ ఊపిరి పీల్చుకోవచ్చు. కానీ మోడీ అనవసరంగా ఎవర్నీ ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు కాబట్టి.. టీఆర్ఎస్ నేతలపై కేసులు కొనసాగించాలని అనుకోకపోవచ్చు. కానీ అమిత్ షా చక్రం అడ్డువేస్తారేమోనని తెలంగాణ బీజేపీ నేతలు ఆశగా ఎధురుచూస్తున్నారు. అది జరిగే ఛాన్స్ దాదాపు లేనట్లే.
మరిన్ని వార్తలు:
విజయసాయికి మైండ్ పోయింది …పాలిటిక్స్ లోతు తెలిసొచ్చింది.
అవును..అతను మా దేశంలోనే ఉన్నాడు
కోర్టు హాలు నుంచి తప్పించుకునేందుకు పన్నాగం…ఎర్రబ్యాగుతో డేరా బాబా సంకేతాలు