Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలంగాణాలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెరాస తేలిగ్గా గెలుస్తుంది అన్నది మెజారిటీ ప్రజల్లో వున్న అభిప్రాయం. నాయకుల్లోను అదే ధోరణి. అందుకే కాంగ్రెస్ తరపున పోరాడేందుకు కూడా నాయకులు ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ అభిప్రాయం మీది నాది మాత్రమే కాదు… కెసిఆర్ మీద యుద్ధం చేయబోతున్న కాంగ్రెస్ ది కూడా. ఆ పార్టీ జాతీయ నాయకత్వం కూడా ఇదే ఒపీనియన్ తో ఉందట. అందుకే ఇటీవల ఏమి చేస్తే తెలంగాణాలో పార్టీ పరిస్థితి మెరుగు అవుతుందో తెలుసుకునేందుకు ఆగష్టు లో ఓ సర్వే నిర్వహించింది. ఆ సర్వే ఫలితాలు చూసి కాంగ్రెస్ కూడా ఆస్చర్యపోయిందట. ఈ సర్వే తరువాత పీసీసీ అధ్యక్ష పీఠం నుంచి ఉత్తమ్ కుమార్ ని తప్పించాలని కూడా ఏఐసీసీ కూడా అనుకుంది. అయితే ఫలితాల తరువాత ఆ ఆలోచన విరమించుకుందట. కాంగ్రెస్ ఆలోచన మార్చేసిన ఆ సర్వే వివరాలు ఆ పార్టీ కే షాకింగ్ అనిపిస్తే ఇక అధికార పార్టీ కి ఎలా అనిపిస్తుందో వేరే చెప్పక్కర్లేదు. ఆ సర్వే ఫలితాలు మీ కోసం …
తెలంగాణ లో 2019 ఎన్నికల నాటికి కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా ఆవిర్భవిస్తుందట. అధికార తెరాస ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో తుడిచిపెట్టుకు పోతుందట. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోనూ ఆ పార్టీ బలం బాగా తగ్గిపోతుందట. నిజామాబాద్, మెదక్ లో మాత్రమే తెరాస బలం అలాగే వుంటుందట. కరీం నగర్, వరంగల్ లోను తెరాస బలం తగ్గుతుంది. తెరాస నష్టపోయిన చోట కాంగ్రెస్ భారీగా లబ్ది పొందుతుంది. మొత్తంగా చూస్తే తెలంగాణాలో తెరాస కేవలం 45 స్థానాలకు పరిమితం అయ్యే అవకాశం ఉందట. అదే సమయంలో కాంగ్రెస్ దాదాపు 55 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందట. రంగారెడ్డి, హైదరాబాద్ లో బీజేపీ కొద్దిగా బలం పుంజుకుంటుంది. ఎంఐఎం పాత బస్తీ లో తన బలం నిలుపుకుంటుందట. ఇక టీడీపీ ఒకే ఒక్క స్థానానికి పరిమితం అవుతుందట. ఇలా వచ్చిన సర్వే వివరాలు సీఎం కెసిఆర్ దృష్టికి కూడా వెళ్లాయట. అందుకే ఆయన శరవేగంగా కొత్త కొత్త సంక్షేమ పథకాలకు రూపకల్పన చేస్తునట్టు తెలుస్తోంది. ఈ సర్వే నిజం అయితే గనుక జనాభిప్రాయాన్ని తేలిగ్గా తీసుకోవడం రాజకీయ పార్టీలకు హెచ్చరికే అని అనుకోవాల్సి ఉంటుంది.
మరిన్ని వార్తలు: