Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘సుబ్రమణ్యం ఫర్‌సేల్’, ‘దువ్వాడ జగన్నాధం’ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లు అందుకున్న దర్శకుడు హరీష్ శంకర్ తన తర్వాత సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాడు. ఇటీవలే తాను విదేశాల్లో లొకేషన్స్ వెదికే పనిలో ఉన్నాను అని, అదే సమయంలో స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతుందని చెప్పుకొచ్చాడు. దిల్‌రాజు బ్యానర్‌లోనే హరీష్ శంకర్ ఈ సినిమాని కూడా చేయబోతున్నాడు. దిల్‌రాజు తాజాగా హరీష్ శంకర్ కోసం ‘దాగుడు మూతలు’ అనే టైటిల్‌ను రిజిస్ట్రర్ చేయించారు. ఇక ఈ సినిమా కోసం ఇద్దరు యువ హీరోలు హరీష్ శంకర్‌కు కావాల్సి ఉందట. ఆ ఇద్దరు యువ హీరోలను ఎంపిక చేయడం ఇప్పుడు ఆయన ముందున్న పెద్ద టాస్క్.
మొదట నాని మరియు శర్వానంద్‌లతో దర్శకుడు హరీష్ శంకర్ దాగుడు మూతలు ఆడివ్వనున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మెగా హీరోు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్‌లు దాగుడు మూతలు ఆడనున్నాను అంటూ సినీ వర్గాల్లో టాక్ వచ్చింది. కాని ఇప్పటి వరకు దాగుడు మూతలు ఆడేందుకు హీరోలు కన్ఫర్మ్ కాలేదని తెలుస్తోంది. పలువురు హీరోల వద్దకు వెళ్లగా హరీష్ శంకర్‌కు స్పష్టమైన హామీ రాలేదని, కాస్త టైం కావాలని కొందరు, ఇప్పుడు ఇలాంటి సినిమాను చేయలేనని కొందరు అన్నారట. దాంతో హరీష్ శంకర్ ఏం చేయాలో పాలుపోక తల పట్టుకున్నాడు. దిల్‌రాజు రంగంలోకి దిగితే ఏమైనా వర్కౌట్ అవుతుందేమో చూడాలి.
మరిన్ని వార్తలు: