Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Karnataka People Attacks On Telugu States Bank Job Aspirants
బ్యాంకు పరీక్షలు రాయటానికి వెళ్లిన తెలుగు వారిపై కర్నాటకలో దాడులు జరిగాయి. ఐబీపీఎస్, ఆర్ ఆర్ బీ పరీక్షలు రాసేందుకు పలువురు తెలుగు అభ్యర్థులు హుబ్లీ వెళ్లారు. అక్కడ వారిని అడ్డుకున్న కన్నడ సంఘాలు కర్రలతో దాడిచేశాయి. పరీక్షలు రాసేందుకు తెలుగు అభ్యర్థులు, ఇతర రాష్ట్రాల వారు హుబ్లీ వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న కన్నడ సంఘాలు రైల్వేస్టేషన్ లోనే వారిని అడ్డుకున్నాయి.
తెలుగువారితో పాటు.. ఇతర రాష్ట్రాల అభ్యర్థులు కొందరిని కన్నడీయులు రైల్వేస్టేషన్ లోనే బంధించారు. స్ఠానికేతరులకు లాడ్జీల్లో గదులు ఇవ్వకూడదని, ఆటోల్లో ఎక్కనివ్వరాదని హెచ్చరికలు కూడా చేశారు.
పరీక్ష సెంటర్ల వద్ద కూడా కాపు కాసి ఇతర రాష్ట్రాల వారిని అడ్డుకున్నారు. తమ ఉద్యోగాలను ఇతర రాష్ట్రాల అభ్యర్థులు తన్నుకుపోతున్నారని ఆరోపిస్తున్న కన్నడ సంఘాలు దాడులకు దిగుతున్నాయి. హుబ్లీ, గుల్బర్గ, దావణగెరె, బెంగళూరుల్లో కన్నడీయులు ఆందోళనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
కర్నూల్ జిల్లా నంద్యాలలో తెలుగు విద్యార్థులతోపాటు అనేక కన్నడ అభ్యర్థులు కూడా బ్యాంకు పరీక్షల కోసం శిక్షణ తీసుకుంటూ ఉంటారు. వారే తెలుగు విద్యార్థులు పరీక్ష రాయడానికి వస్తున్నారని కన్నడ సంఘాలకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది.
మరిన్ని వార్తలు: