Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Help Of Rahul SangaReddy With Congress Has Been Hit By The KCR
తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని టీకాంగ్రెస్ పట్టుదలగా ఉంది. రాహుల్ సంగారెడ్డి సభ విజయవంతం కావడంతో.. ఆపార్టీ శ్రేణులు ఫుల్ జోష్ లో ఉన్నాయి. ఎలాగైనా రాహుల్ ను ఉపయోగించుకుని, ఆయన ఛరిష్మాతో కేసీఆర్ కు దెబ్బ కొట్టాలని కాంగ్రెస్ ఫిక్సైంది. అందుకోసం రంజాన్ తర్వాత రాహుల్ సందేశ్ యాత్ర తలపెట్టారు పీసీసీ నేతలు.
60 ఏళ్ల ఉద్యమ కలను సాకారం చేశాం.. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చాం.. అయినా కనీస స్థాయిలో కేసీఆర్ కు ప్రతిఘటన ఇవ్వలకేపోవడంపై రాహుల్ కూడా నేతలకు క్లాస్ పీకారట. అసలు ఉద్యమంలో వాళ్ల కంటే మీరే ఎక్కువ చేశారని, వాళ్లతో కుమ్మక్కవలేదు కదా అనే డౌట్ కూడా వ్యక్తం చేశారట రాహుల్. దీంతో కాంగ్రెస్ నేతల్లో చురుకు పుట్టింది. ఇలాగే ఉంటే.. అధిష్ఠానానికి కూడా నమ్మకం పోతుందని గ్రహించి వరుస ఆందోళనలకు ప్లాన్ చేస్తున్నారు.
పీసీసీ నేతలెవరికీ ప్రజల్లో ఆదరణ లేదు కాబట్టి.. రాహుల్ పేరుతో ప్రచారం చేయాలని టీకాంగ్రెస్ నిర్ణయించింది. ఎన్నికల్లో కూడా రాహుల్ విధానాలు అమలు చేస్తామని చెప్పాలని అనుకుంటున్నారు. రాహుల్ సంగారెడ్డి సభకు జనం స్పందించారు కాబట్టి.. ఆయన్ను నమ్ముకోవడమే ఉత్తమమని భావిస్తున్నారు టీకాంగ్రెస్ సీనియర్లు.
మరిన్ని వార్తలు :