Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఏడాదిలో ఎక్కువమందిపై ప్రభావం చూపిన వ్యక్తులను కానీ, సంఘటనకు సంబంధించిన బృందాన్ని కానీ టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపిక చేస్తుంది. వారి ఫొటోను ముఖచిత్రంగా ప్రచురిస్తుంది. టైమ్ కవర్ పేజీపైకి ఎక్కడం చాలా ప్రతిష్టాత్మకమైన విషయం. ఈ ఏడాది మీటూ ఉద్యమకారిణిలు ఈ ఘనత సాధించారు. హాలీవుడ్ నిర్మాత హార్వీ వీన్ స్టెయిన్ చేతిలో వేధింపులకు గురయిన వీరంతా… తమకు జరిగిన అన్యాయాన్ని మీటూ యాష్ ట్యాగ్ ఉద్యమం ద్వారా ప్రపంచానికి తెలియజేశారు.
ఈ ఉద్యమాన్ని నడిపిన ఐదుగురు మహిళలు నటి యాష్లీ జుడ్, ఉబెర్ మాజీ ఇంజనీర్ సూసెన్ ఫౌలర్, అడామా ఇవూ, పాప్ గాయని టేలర్ స్విఫ్ట్, ఇసబెల్ పాస్కుల్ ఫొటోలను టైమ్ కవర్ పేజీపై ప్రచురించింది. ఎంతో మందిని ప్రభావితం చేసిన ఈ ఉద్యమాన్ని గుర్తిస్తూ ద సైలెన్స్ బ్రేకర్ అని టైమ్ మ్యాగజైన్ ప్రచురించింది. మీ టూ ఉద్యమం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అనేకమంది మహిళలు తమకు ఎదురయిన లైంగిక వేధింపులను బయటపెట్టారు. వారిలో బాలీవుడ్ హీరోయిన్లు కూడా ఉన్నారు.