కరోనా వైరస్ తో ప్రపంచమంతా వణికిపోయింది. ఇప్పుడిప్పుడే కాస్త ప్రపంచ దేశాలతో పాటు మనదేశం ఉపశమనం పొందుతుంది. అయితే ఈ వైరస్ ఇప్పటికిప్పుడు పూర్తిగా తొలగిపోయేది కాదని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించిన విషయం తెలిసిందే. అలాగే.. ఇండియాలో ఈ మధ్య గతంలో కంటే భిన్నంగా కరోనా కేసుల సంఖ్య భారీగానే పెరుగుతోంది. దీంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను ఈనెలాఖరు వరకు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. ముఖ్యంగా ఈరోజుతో మూడో విడత లాక్ డౌన్ ముగుస్తుండటంతో.. మరో 14 రోజులపాటు లాక్ డౌన్ ను పొడిగించింది కేంద్రం.
అయితే లాక్డౌన్ 4.o నిబంధనలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయంపై దేశప్రజలు ఉదయం నుంచి ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. అందుకు కాసేపటి క్రితమే తెరపడింది. కేంద్ర హోం శాఖ కొత్త నిబంధనలను ప్రకటించింది. అవేమంటే..
కేంద్రప్రభుత్వం నిర్దేశించిన కొత్త మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి.
- ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మధ్య సమన్వయంతో కూడిన అంతర్రాష్ట్ర రవాణాను జరుపుకోవచ్చని తెలిపింది.
- రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో ఆయా ప్రభుత్వాల నిర్ణయం, అంగీకారం కుదిరిన తర్వాతనే రవాణా సేవలు జరుపుకోవచ్చు.
- అన్ని రాష్ట్రాలు సరుకు రవాణా వాహనాలను అనుమతించాలి.
- రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కఠినమైన రీతిలో కర్ఫ్యూ అమల్లో ఉంటుంది.
- జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు, మెట్రో రైలు సర్వీసులకి అనుమతి లేదు.
- పాఠశాలలు, కళాశాలలు, హోటల్స్, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, జిమ్‌లు, ఆడిటోరియమస్స్ కి అనుమతి లేదు.
- పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్న అన్ని రాజకీయ, మతసంబంధమైన సభలకు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతి లేదు.
- కంటైన్మెంట్ జోన్లలో కాకుండా మిగిలిన అన్ని జోన్లలో అంతరాష్ట్ర బస్సు సర్వీసులు, సొంత వాహనాల ప్రయాణానికి వెసులుబాటు కల్పించారు.
- అంతరాష్ట్ర రవాణాకు సంబంధించి రెండు రాష్ట్రాల అనుమతులు తప్పకుండా తీసుకోవాలి.
- ప్రజా రవాణా విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలదే తుది నిర్ణయం.
- క్రీడల నిర్వహణకు అనుమతులు ఇచ్చింది. కానీ.. ప్రేక్షకులకు అనుమతి లేదు.
- కంటైన్మెంట్ జోన్లలో నిత్యావసర, అత్యవసర వస్తువులకు అనుమతి ఇవ్వడం జరిగింది.
- స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు మూసివేత అలాగే కొనసాగుతుంది.
- ఆన్ లైన్ విద్యాబోధన, దూరవిద్య బోధన కొనసాగించుకోవచ్చు.
- హోటళ్లు, రెస్టారెంట్ల మూసివేత ఉంటుంది. అయితే హోటళ్లను, లాడ్జీలను వైద్య, ఆరోగ్య, పోలీసు సిబ్బందికి కేటాయించినట్లైతే అవి ఓపన్ లో ఉంటాయి.
- బస్ డిపోలు, రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టుల్లో ఉండే క్యాంటీన్లకు అనుమతి.
- ఆహార పదార్థాలు హోమ్ డెలివరీ చేసేందుకు రెస్టారెంట్లకు అనుమతి