Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బీజేపీ పాలిత రాష్ట్రాల్ని పిల్లల చావులు బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటికే యూపీ గోరఖ్ పూర్లో 72 మంది పిల్లలు చనిపోవడంతో.. యోగి ఆదిత్యనాథ్ కు ముచ్చెమటలు పడ్డాయి. ఇప్పుడిప్పుడే ఆయన విమర్శల తుఫాను నుంచి కాస్త తెరిపిన పడ్డారు. యూపీలో గొడవ సద్దుమణిగిందో లేదో ఛత్తీస్ గఢ్ లో మొదలైంది. రాయ్ పూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ముగ్గరు చిన్నారులు చనిపోవడం రమణ్ సింగ్ పీకల మీదకు తెచ్చింది.
యూపీలో ఆక్సిజన్ ప్రాబ్లమ్ తో చిన్నారులు చనిపోగా.. ఛత్తీస్ గఢ్ లో సేమ్ సీన్ రిపీట్ కావడం ప్రధాని మోడీకి కోపం తెప్పించింది. ఆయన వెంటనే ఛత్తీస్ గఢ్ ఫోన్ చేసి రమణ్ సింగ్ ను దులిపేశారట. చిన్న నిర్లక్ష్యపు ఘటనలే పుట్టి ముంచుతాయని, ఆక్సిజన్ సప్లై ఆగుతుంటే ఏం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో యోగికి కూడా క్లాస్ పీకిన మోడీ.. బీజేపీ పాలిత సీఎంల మీటింగ్ ఈ ఇష్యూను ప్రముఖంగా ప్రస్తావించారట.
పెద్దవాళ్లు చనిపోతే ఓ రకంగా ఉంటుందని, కానీ చిన్నారులు మరణిస్తే ఆ ప్రభావం ఎన్నికలపై తీవ్రంగా పడుతోందని, ఆమాత్రం జాగ్రత్త లేకపోతే ఎలాగని మందలించారు. కానీ మోడీ మందలించినా జరగాల్సిన నష్టం జరిగిపోయిందంటున్నాయి పార్టీ శ్రేణులు. ఏ మచ్చా లేని రమణ్ సింగ్ పై మొదటి మచ్చ పడిందని, ఇక ప్రత్యర్థులు అవకాశం తీసుకుంటారని భావిస్తున్నారు. ఎన్నికల నాటికి వ్యతిరేకత రాకుండా ప్రజల దృష్టి మళ్లించే పనిలో కమలనాథులు బిజీగా ఉన్నారు.