ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఈ నెల 30న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత ఇది తీవ్రంగా మారొచ్చని తెలిపారు. రాష్ట్రంలో రాబోయే 48 గంటల్లో తేలికపాటినుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల కు దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్రమట్టానికి 3.1కి.మీ., నుంచి 7.5 కి.మీ., మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నదని పేర్కొన్నారు.