Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
డ్రగ్స్ కేసును వ్యూహాత్మకంగా సీరియస్ గా తీసుకున్న కేసీఆర్ సర్కారు.. ఇప్పుడు మళ్లీ నీరుగారుస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో సెకండ్ రౌండ్ ఎంక్వైరీపై అకున్ సభర్వాల్ హింట్ ఇచ్చారా.. లేదని చెప్పారా అనేది అర్థం కాకుండా ఉంది. అసలు అకున్ సభర్వాల్ గోప్యత అంటూ పెద్దవాళ్లున్నారని చెప్పడమేంటని జనాలు బుర్ర గోక్కుంటున్నారు.
డ్రగ్స్ కేసును సోషల్ ఇష్యూగా తీసుకోకుండా.. పొలిటికల్ యాంగిల్లోనే మొదట్నుంచి కథ నడిపింది సర్కారు. మియాపూర్ ల్యాండ్ స్కామ్, నేరెళ్ల ఘటన వంటి సంఘటనల్ని మరిచిపోయేలా చేయడానికి సెలబ్రిటీల్ని వాడుకున్నారనే వాదన బలంగానే ఉంది. విచారణ కూడా అందుకు తగ్గట్లుగానే జరిగింది. పేరున్న వాళ్లందర్నీ గంటల తరబడి విచారించి.. వారిపై అనుమానాలు బలపడేలా చేసింది సిట్.
కానీ ఛార్మి కోర్టు ఎపిసోడ్ తర్వాత అందర్నీ త్వరగానే విచారిస్తోంది. గతంలో పార్ట్ -2 ఉంటుందని బలంగా చెప్పిన అకున్.. ఇప్పుడు మాత్రం నర్మగర్భంగా మాట్లాడుతున్నారు. ఇంతకీ ఒత్తిళ్లు టాలీవుడ్ నుంచా.. అధికార పార్టీ నుంచా అని సెటైర్లు కూడా పడుతున్నాయి. కేసీఆర్ ఏం చేసినా ఏదో రకంగా ఆయనకే రివర్స్ కొట్టడం కామనైపోయింది. మరి డ్రగ్స్ కేసు ఏ తీరాలకు చేరుతుందో.
మరిన్ని వార్తలు:
జీవన్‌దాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా పవన్
అంబేద్కర్ అల్లూరికి కులమా… పవన్