నటుడు, టీడీపీ నేత నందమూరి హరికృష్ణ మృతి పట్ల తెలుగు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆకస్మిక మరణం తమను షాక్ కు గురి చేసిందని అందరు స్టార్ హీరోలు ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ‘కొన్ని వారాల క్రితమే ఆయన నాతో.. నిన్ను చూసి చాలా రోజులయింది, కలవాలి తమ్ముడు అని అన్నారు. ఇప్పుడు ఆయన ఇక లేరు. మిస్ యూ అన్న’ అంటూ హీరో నాగార్జున ట్విటర్‌లో తన సంతాపాన్ని తెలియజేశారు. మొత్తం తెలుగు చలన చిత్ర సీమ ఆయన మృతితో విషాదంలో మునిగిపోయిందనే చెప్పాలి. ప్రస్తుతం ఆయనకు కామినేని ఆసుపత్రిలోనే పోస్టుమోర్టం నిర్వహిస్తున్నారు.
మోహన్‌బాబు
ఈరోజు నా సోదరుడు నందమూరి హరికృష్ణను కోల్పోయాను. ఇంతకు మించి నాకు మాటలు రావడంలేదు. ఇది తీరని లోటు.
మహేష్ బాబు
హరికృష్ణ గారు ఇకలేరనే వార్త విని చాలా బాధపడ్డాను. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో నా సోదరుడు ఎన్టీఆర్, అతని కుటుంబానికి నా సానుభూతిని తెలియజేస్తున్నా.
చాలా బాధాకరం: రామ్ చరణ్
హరికృష్ణ గారి ఆకస్మిక మరణం నన్ను షాక్‌కు గురిచేసింది. రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెండం చాలా బాధాకరం. ఆయన కుటుంబానికి నా సానుభూతిని తెలియజేస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా.
ఇప్పుడే ఈ చేదు వార్తను విన్నా: అల్లు అర్జున్
నేను విదేశాల్లో ఉన్నా.. ఇప్పుడే ఈ చేదు వార్తను విన్నా! షాక్‌కు గురయ్యా. నందమూరి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. కళ్యాణ్‌రామ్, ఎన్టీఆర్‌ను సానుభూతి తెలియజేస్తున్నా. రిప్!
సాయిధరమ్ తేజ్
హరికృష్ణ గారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.
దేవీశ్రీ ప్రసాద్
హరికృష్ణ గారి గురించి ఇలాంటి వార్త వినడం నమ్మలేకపోతున్నాను. చాలా గొప్ప వ్యక్తి. నాకు, నా తండ్రికి ఆయన చాలా ఆప్తుడు. ఆ భగవంతుడు కుటుంబసభ్యులకు శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను.
మంచు లక్ష్మీ
ఈ వార్త నన్ను చాలా షాక్‌కు గురిచేసింది. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.
మంచు మనోజ్
ఈ వార్త విని షాక్‌కు గురయ్యాను. నాకు మాటలు రావడం లేదు. దేవుడు కఠినమైనవాడు. ఆయన కుటుంబసభ్యులకు, అభిమానులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను.
అల్లు శిరీష్
ఈ వార్త వినడం చాలా బాధకరంగా ఉంది. నందమూరి కుటుంబసభ్యులకు నా సంతాపన్ని తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలిని కోరుకుంటున్నాను.
సంతాపాన్ని ప్రకటించిన మరికొందరు సినీ ప్రముఖులు