Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జైలవకుశ డైరెక్టర్ బాబీ జూబ్లీహిల్స్ పోలీసులకు నిన్న రాత్రి 11.30 గంటల సమయంలో లొంగిపోయాడు. పోలీసుల వివరాల ప్రకారం అమీర్‌పేట్‌కు చెందిన హర్మీందర్‌సింగ్ ఫ్యామిలీ సభ్యులతో ఆదివారం రాత్రి తన కారులో జూబ్లీహిల్స్‌లోని ఓ ఫంక్షన్‌కు అటెండయ్యాడు. అర్ధరాత్రి తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో వీళ్లు ప్రయాణిస్తున్న కారుని జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 33 వద్ద.. డైరెక్టర్ దర్శకుడు బాబీ కారు వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. బాబీ అతివేగంతో కారు నడుపుతూ తన కారుని ఢీకొట్టాడుని ఈ ఘటనలో ఒకరికి బలమైన గాయాలయ్యాయని హర్మీందర్‌సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో హర్మిందర్ కారు వెనక పూర్తిగా ధ్వంసమైంది.
కారు దిగిన హర్మిందర్ బాబీని నిలదీయగా బాబీతోపాటు కారులోవున్న మరో ముగ్గురు హర్మిందర్‌ను బెదిరించే ప్రయత్నం చేశారని పక్కనే తన ఇల్లు ఉందని కూర్చుని మాట్లాడుకుందామని అన్నాడని అదే సమయంలో కారులోవున్న హర్మిందర్ తల్లికి చాతీలో నొప్పి రావడంతో హర్మిందర్ ఆ టెన్షన్లో ఉండగా బాబీ అక్కడి నుంచి జారుకున్నారని హర్మీందర్ పేర్కొన్నారు దీంతో బాధితుడు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.