Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
డ్రగ్స్ కేసుకి సంబంధించి టాలీవుడ్ లో ఇంకో 10 మందికి నోటీసులు అందుతాయని , అందులో పెద్ద కుటుంబాలకి చెందిన వారు వున్నారని వార్తలు వస్తుండగానే సీఎం కెసిఆర్ ప్లేట్ తిప్పారు. సినీ రంగాన్ని డ్రగ్స్ కేసు ద్వారా భయబ్రాంతులకు గురి చేసే ఉద్దేశం లేదని సీఎం కెసిఆర్ స్వయంగా చెప్పడం చూస్తుంటే లోలోన ఏదో జరిగింది అనిపిస్తోంది. పైగా నిన్నమొన్నటిదాకా డ్రగ్స్ కేసులో ఎంతటివారు వున్నా తాట తీస్తాం అన్నవాళ్ళే ఇప్పుడు సినీ రంగానికి చెందిన వాళ్ళు డ్రగ్స్ కేసులో బాధితులే తప్ప నిందితులు కాదన్నంతగా భరోసా ఇవ్వడం మాత్రం ఆషామాషీగా జరిగిపోలేదు.
ఎప్పుడైతే మరో 10 మంది టాలీవుడ్ ప్రముఖులకు నోటీసులు అన్న విషయం బయటికి వచ్చిందో అప్పుడే ఇండస్ట్రీ లో వణుకు మొదలైంది. దీంతో అప్పటికప్పుడు ఓ రహస్య ప్రదేశంలో టాలీవుడ్ పెద్దలు కొందరు సమావేశమై త్వరలో ఇండస్ట్రీ ని ఇక్కడ నుంచి తరలించకపోతే కష్టమని అనుకున్నారట. ఇదే విషయాన్ని సిట్, ప్రభుత్వాన్నికి లీకులు ఇచ్చారట. బాగా సెన్సిటివ్ విషయం కావడంతో కొందరు కలుగజేసుకుని అప్పటికప్పుడు కెసిఆర్ కి విషయం తెలిపారట. నిజంగానే టాలీవుడ్ పెద్దలు ఇండస్ట్రీ ని తరలించే ఆలోచనలో ఉన్నట్టు తెలుసుకున్న తర్వాత కాస్త పట్టువిడుపులు ప్రదర్శించాలని కెసిఆర్ సర్కార్ అనుకుంటున్నట్టు సమాచారం. టాలీవుడ్ బెదిరింపు ఇలా ఉంటే అటు ఐటీ ఉద్యోగుల్ని కదిలిస్తే ఆ ఇండస్ట్రీ లో ప్రకంపనలు వస్తాయని భయం, ఇక స్కూల్స్ జోలికి వెళితే పిల్లల భవిష్యత్ కి అవరోధం కలుగుతుందని భావిస్తున్నారు. మొత్తానికి ఈ విధంగా డ్రగ్స్ కేసు హడావిడికి త్వరలో బ్రేక్ పడేలా వుంది.
మరిన్ని వార్తలు