Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
2017 సగం పూర్తి అయ్యింది. ఇప్పటికే హేమాహేమీలు ప్రథమార్థంలో వచ్చారు. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన పలు చిత్రాలు ఈ సంవత్సరం ఆరంభంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 సినిమాలను తీసుకుంటే అందులో రెండు నాని సినిమాలు ఉండటం గమనార్షం. స్టార్ హీరోలు పలువురు ఈ సంవత్సరం బాక్సాఫీస్ వద్దకు వచ్చినా కూడా నాని ముందు నిలవలేక పోయారు. ముఖ్యంగా ఓవర్సీస్లో నాని వీర విహారం చేయడం అందరిని ఆశ్చర్యపర్చుతుంది. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి స్టార్స్‌ను కూడా నాని పక్కకు నెట్టేస్తున్నాడు.
2017 ప్రారంభం నుండి ఇప్పటి వరకు నాని రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ రెండు సినిమాలు కూడా ఓవర్సీస్లో దుమ్ము దుమ్ముగా కలెక్షన్స్‌ను రాబట్టాయి. ఈ సంవత్సరం ఓవర్సీస్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నెం.1 స్థానంలో బాహుబలి 2 ఉంది. 128 కోట్ల కలెక్షన్స్‌ను ఓవర్సీస్లో ఈ చిత్రం రాబట్టింది. ఇక నెం.2 స్థానంలో ఖైదీ నెం.150 చిత్రం ఉంది. 16.33 కోట్లను చిరంజీవి ఓవర్సీస్లో రాబట్టగలిగాడు. ఇక మూడవ స్థానంలో గౌతమిపుత్ర శాతకర్ణి ఉంది. 11 కోట్లను బాలయ్య రాబట్టాడు. ఆ తర్వాత నాని ‘నిన్ను కోరి’ చిత్రం 7.47 కోట్లు రాబట్టి నెం.4 స్థానంలో ఉంది. నెం.5 స్థానంలో కాటమరాయుడు, నెం.6 స్థానంలో డీజే, నెం. 7 స్థానంలో నాని ‘నేను లోకల్’ చిత్రం నిలిచింది. ఆ తర్వాత స్థానంలో శతమానం, ఘాజీ చిత్రాలు ఉన్నాయి. ఇదే సంవత్సరం నాని ‘ఎంసీఏ’ చిత్రంతో ప్రేక్షకలు ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమా కూడా ఓవర్సీస్లో మంచి కలెక్షన్స్‌ను రాబట్టడం ఖాయంగా కనిపిస్తుంది.
మరిన్ని వార్తలు: