ట్రంప్ లో ఎవరూ చూడని కోణం

Trump stops to retrieve Marine's guard

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనేలేదు. ప్రపంచవ్యాప్తంగానే కాదు.. స్వదేశంలోనూ ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉంది. అహంకారి అని, అబద్ధాలకోరని మీడియా ప్రచారం చేస్తూనే ఉంది. అటు విదేశీ టూర్లలో ట్రంప్ తలతిక్క పనులు కూడా అలాగే ఉన్నాయి. మొన్నటికి మొన్న జీట్వంటీలో ట్రంప్ పరువు తీశాయి సాటి దేశాలు. అయినా సరే ట్రంప్ నిస్సిగ్గుగానే ఉన్నారు. కానీ తనలోనూ మానవత్వం ఉందని చాటుకున్నారు ట్రంప్.

జీట్వంటీ సమావేశాలు ముగిశాక హాంబర్గ్ నుంచి అమెరికా ఫ్లైటెక్కుతున్న ట్రంప్ దృష్టి.. అక్కడ గౌరవ వందనం చేస్తున్న మెరైన్ గార్డులపై పడింది. ఓ మెరైన్ గార్డ్ టోపీ గాలికి పక్కకిపోవడంతో.. ట్రంప్ తీసి సరిగ్గా పెట్టారు. కానీ మళ్లీ అది కిందపడిపోయింది. దీంతో ట్రంప్ కూడా కిందకు వంగి టోపీ తీయబోయారు. అయితే మరో గార్డ్ ఆయనకు సాయం చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ట్రంప్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

ట్రంప్ తుంటరి, తెంపరి అంటూ కథలల్లిన మీడియా ఇప్పుడేం సమాధానం చెబుతుందని నిలదీస్తున్నారు. నిజానికి ట్రంప్ వ్యవహారశైలికి ఇది పూర్తిగా భిన్నం. తనపై నెగటివిటీ తగ్గించుకునేందుకు ట్రంప్ ఇలా చేశారా.. నిజంగానే మారిపోయారా అనేది జనంలో అనుమానంగానే ఉంది. ఏదో పొరపాటున ట్రంప్ మంచి పని చేశారని, నిజానికి చెడ్డపనులే ఆయనకు సూటౌతాయని విమర్శకులు ఎత్తిపొడుస్తున్నారు.

మరిన్ని వార్తలు

ఇలాంటివి ఎయిరిండియాకే సాధ్యం

సంజయ్ గాంధీకి పెళ్ళికి ముందే కూతురుందా ?