Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్తో తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు భేటీ అయ్యారు. జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలంలో కొనసాగుతోంది. ఈ ఉదయం పాదయాత్ర ముగించికొని మధ్యాహ్నం 1.45కి జగన్ హైదరాబాద్ చేరుకున్నారు. సాయంత్రం 4.15కి రమణ దీక్షితులు…హైదరాబాద్ లోటస్ పాండ్లోని జగన్ నివాసంలో .నివాసానికి వెళ్లి సమావేశమయ్యారు. తాజాగా తిరుమల తిరుపతి దేశస్థాన బోర్డుపై రమణ దీక్షితులు తీవ్ర వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కారు. రహస్య తవ్వకాలతో పాటు శ్రీవారికి చెందిన పింక్ వజ్రం గురించి ఆయన లేవనెత్తిన పలు అంశాలు రాజకీయ రంగు పులుముకున్నాయి. రమణ దీక్షితులపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తిరుమల శ్రీవారి సన్నిధిని టీడీపీ తమ ‘అడ్డాగా’ మార్చుకుని అధికారం చెలాయిస్తోందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. రమణ దీక్షితులు చేసిన ఈ విమర్శలని అవకాశంగా తీసుకుని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి పిటిషన్ కూడా వేసేసారు. ఆయన పిటిషన్ వేయడంతో ఈ విషయంపై జాతీయ మీడియాలో ప్రత్యేకంగా చర్చలకు సైతం దారితీసింది. అయితే ఇదంతా ఆపరేషన్ గరుడలో భాగంగానే జరిగింది అంటూ తెదేపా కూడా ఎదురు దాడి ప్రారంభించింది.
టీటీడీ బోర్డు కూడా రమణ దీక్షితులు పై క్రిమినల్ కేసులతోపాటు పరువు నష్టందావా వేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో జగన్ను రమణ దీక్షితులు భేటీ కావడం సంచలనం రేపుతోం ది. టీటీడీపై రమణదీక్షితులు వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత జగన్తో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రతిపక్ష నేతతో రమణ దీక్షితులు భేటీ అనంతరం రమణదీక్షితులు మాట్లాడుతూ టీటీడీ విషయంలో తాను ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. మిరాసీ వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు.
నా పొట్ట ఎవరు నింపితే వారికే మద్దతు ఇస్తానని రమణ దీక్షితులు వెల్లడించారు. ఇప్పటికే ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు వంటి మరికొందరు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన పెద్దలను దగ్గర చేసుకునే యోచనలో ఉన్న వైసీపీ ఇప్పుడు రమణ దీక్షితులు అంశాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకుని కుదిరితే ఆయన్ని రాజకీయ రంగప్రవేశం చేయించే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆయనను ప్రత్యక్ష ఎన్నికల్లో దింపకపోయినా.. టీడీపీకి నష్టం కలిగించేలా ప్రచారానికి వాడుకుని అన్నీ బాగుంది వైసేపీ అధికారంలోకి వస్తే నామినేటెడ్ పదవో లేక బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవో ఇచ్చే ఛాన్స్ ఉందని కూడా తెలుస్తోంది. నా పొట్ట ఎవరు నింపితే వారికే మద్దతు ఇస్తానని రమణ దీక్షితులు పేర్కొనడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది