Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా భాగ్యనగరి ఘననివాళి అర్పించింది. సాధారణంగా ప్రముఖ నేతల వర్ధంతిరోజు కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీల్లో రెండు నిమిషాలు మౌనం పాటించి ప్రజలు నివాళులర్పిస్తారు. కానీ ఈ సారి హైదరాబాద్ ప్రజలు రోడ్లపై నిలబడి మహాత్మునికి అంజలి ఘటించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు, ప్రజలు రహదారులపై ఎక్కడివారక్కడ ఆగిపోయి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఉదయం 11గంటలకు నివాళి కార్యక్రమం జరిగింది. ఆ సమయంలో ట్రాఫిక్ పోలీసులు వాహనాల రాకపోకలను ఎక్కడికక్కడ నిలిపివేశారు. నగరంలో ప్రధాన కూడలైన ఖైరతాబాద్ లో నాలుగు వైపులా ట్రాఫిక్ పోలీసులు రెడ్ సిగ్నల్ వేసి వాహనాలు ఆపారు. పంజాగుట్టలోనూ వాహనాలు నిలిపివేశారు. వాహనదార్లు హారన్లు కూడా మోగించలేదు. పాదాచారులు కూడా రోడ్డుపై మౌనంగా నిలబడిపోయారు. ప్రభుత్వ ఆదేశాలను ప్రజలంతా స్వచ్చందంగా పాటించారు. జాతిపిత త్యాగాలు గుర్తుచేసుకుంటూ రెండు నిమిషాలు మౌనం వహించి నివాళులర్పించారు.