Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు ప్రేక్షకులకు ఉమైర్ సంధు పేరు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఏ పెద్ద స్టార్ హీరో సినిమా వచ్చినా కూడా దాన్ని దుబాయి సెన్సార్ బోర్డు సభ్యుడిగా స్క్రీనింగ్ చేసి తన రేటింగ్ ఇస్తూ ఉంటాడు. దాదాపు అన్ని పెద్ద సినిమాలకు కూడా ఉమైర్ సంధు రేటింగ్ ఇవ్వడం పరిపాటి. తాజాగా వచ్చిన సినిమాలకు కూడా ఈయన రేటింగ్ ఇచ్చిన విషయం తెల్సిందే. సినిమాలు విడుదలైన తర్వాత కలెక్షన్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తుంటాడు. ఎప్పుడు సినిమాల రివ్యూలు, కలెక్షన్స్ గురించి మాట్లాడే ఉమైర్ సంధు మొదటి సారి ఒక స్టార్ సెలబ్రెటీ గురించి వ్యక్తిగత విషయమై ట్వీట్ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది.
ఆ స్టార్ సెలబ్రెటీ మరెవ్వరో కాదు ‘బాహుబలి’ స్టార్ ప్రభాస్. అవును గత కొంత కాలంగా ప్రభాస్ పెళ్లి విషయమై తారా స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. అనుష్కతో ప్రభాస్ ప్రేమ అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. కాని ఆ వార్తలపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. అప్పుడప్పుడు వారి వద్ద ఆ విషయాన్ని ప్రస్థావించినా కూడా నవ్వేసి ఊరుకుంటున్నారు. తాజాగా ప్రభాస్, అనుష్కల మద్య వ్యవహారంపై ఉమైర్ సంధు వరుసగా ట్వీట్స్ చేశాడు. ప్రభాస్ మరియు అనుష్కలు వివాహం చేసుకోబోతున్నారు అనేది ఆయన ట్వీట్ సారాంశం.
అనుష్క, ప్రభాస్‌లు రిలేషన్షిప్లో ఉన్నారు, వారి ఆప్త మిత్రుల నుండి నాకు సమాచారం అందింది. వారిద్దరు డిసెంబర్లో ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారు, వీరిద్దరికి ఒక్కరు అంటే మరొకరికి చాలా ఇష్టం. ఆ ఇష్టం ఇప్పటిది కాదు, చాలా సంవత్సరాలుగా వీరి ప్రేమ వ్యవహారం సాగుతుందని ఉమైర్ సంధు పేర్కొన్నాడు. ఉమైర్ ట్వీట్స్ ఇప్పుడు సంచలనం అవుతున్నాయి. ఈయన ట్వీట్స్ చేశాడు అంటే ఖచ్చితంగా 90 శాతం నిజం ఉండి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇదే కనుక నిజం అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ఖచ్చితంగా చాలా సంతోషిస్తారు. మరో రెండు రోజుల్లో నాగచైతన్య, సమంతలో ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు. ఈలోపు మరో టాలీవుడ్ ప్రేమ జంట వెలుగులోకి రావడంతో అంతా కూడా ఒక్కింత సంభ్రమాశ్చర్యాకు గురి అవుతున్నారు. డిసెంబర్లో వీరి వివాహ నిశ్చితార్థంకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఉమైర్ చెబుతున్నాడు. ఉమైర్ ట్వీట్స్‌పై అనుష్క లేదా ప్రభాస్‌లు క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ప్రస్తుతం అనుష్క ‘భాగమతి’ చిత్రంలో ప్రభాస్ ‘సాహో’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు కూడా ఒకే బ్యానర్లో నిర్మాణం జరుగుతున్న విషయం తెల్సిందే