స్కిల్ డెవలప్మెంట్ ఒప్పందం స్కామ్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినప్పటికీ ఓ కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ ఒప్పందంలో అసలు ఎలాంటి అవినీతి జరగలేదని డిజైన్ టెక్ మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ ఖన్వీల్కర్ స్పష్టం చేశారు. చంద్రబాబును స్కామ్ జరిగిందంటూ అరెస్టు చేయడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం మేరకు రూ.371 కోట్ల విలువైన సామగ్రి సరఫరా చేసినట్లు డిజైన్‌టెక్ ఎండీ స్పష్టం చేశారు.
అయితే పరికరాలు బాగా లేకున్నా, రిపేరు వచ్చినా బాధ్యత తీసుకునే ఒప్పందం ప్రకారం తీసుకున్నామన్నారు. ప్రభుత్వంతో జరిగిన ఒప్పందంలో ఈ మేరకు షరతు ఉందని వెల్లడించారు. జీఎస్టీ కుంభకోణం ఉందనే ఆరోపణలు కూడా అబద్ధమేనని వికాస్ తెలిపారు. ఇది సర్వీస్ ట్యాక్స్‌కు సంబంధించిన అంశమని, ఈ కేసులో దర్యాప్తు సంస్థలు తమతో సంప్రదించలేదని ఆయన పేర్కొన్నారు. ఎమైనా లెక్కల్లో అనుమానాలు ఉంటే ఆడిటర్లను పంపితే పూర్తిగా సహకరిస్తామని ఆయన స్పష్టం చేశారు.