Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎవరు తీసుకున్న గోతిలో వారే పడక తప్పదు. ఇప్పటివరకు జియోతో టెలికాం విప్లవం తీసుకొచ్చామని చంకలు గుద్దుకుంటున్న ముకేష్ అంబానీ.. రాబోయే దుష్పరిమాణాలను ఊహించడం లేదని పోటీ కంపెనీలు భావిస్తున్నాయి. జియో ఫోన్ వస్తే వ్యాపారాలు కుదేలౌతాయని మీడియా అంటున్నా.. కార్పొరేట్ టెలికాం దిగ్గజాలు మాత్రం కులాసాగా ఉన్నాయి.
1500 సెక్యూరిటీ డిపాజిట్ కడితే.. మూడేళ్ల తర్వాత వెనక్కిస్తామని మాత్రమే ముకేష్ చెప్పారు. కానీ రిలయెన్స్ అధికారుల్ని కదిలిస్తే అసలు నిజం బయటపెట్టారు. ప్రతి నెలా రీఛార్జ్ చేయించుకున్నవారికే ఈ ఆఫర్ వర్తిస్తుందట. మధ్యలో పొరపాటున ఒక్క నెల రీఛార్జ్ చేయకపోయినా డిపాజిట్ వెనక్కురాదు. అంటే నూటికి 99 శాతం డిపాజిట్లు కంపెనీ దగ్గరే ఉంటాయి.
పైగా నెల నెలా రీఛార్జ్ కు 309 రూపాయలు కట్టాలి. అంతకంటే తక్కువధరకే ఎయిర్ టెల్, ఐడియా, బీఎస్ఎన్ఎల్ వాయిస్, డేటా ను అందిస్తున్నాయి. పైగా ఫోన్ కేబుల్ టీవీకి కనెక్ట్ చేస్తేనే ఛానెల్స్ వస్తాయి. ఫోన్ బయటికెళ్తే టీవీ రాదు. అలాంటప్పుడు తమకు నష్టమేంటని డీటీహెచ్ కంపెనీలు కూడా అంటున్నాయి.
మరిన్ని వార్తలు: