Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నాగశౌర్య హీరోగా తెరకెక్కిన ‘ఛలో’ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. యూత్ ఆడియన్స్ను ఆకట్టుకున్న ఈ చిత్రం వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కింది. నాగశౌర్యతో సినిమా అంటే అయిదు కోట్ల కంటే ఎక్కువ పెడితే కష్టమే అని భావిస్తున్న నేపథ్యంలో ఆయన తల్లి ఉషా మాల్పురి ఏకంగా 10 కోట్లు ఖర్చు చేసి సినిమాను నిర్మించింది. కొడుకుపై అభిమానంతో, కొడుకు హీరోగా సెటిల్ అవ్వాలనే కోరికతో ఉషా ఈ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. శౌర్య నటించే ఈ చిత్రం సక్సెస్ అయినా అంతగా వసూళ్లు రావని అంతా భావించారు. కాని అందరి అంచనాలు తలకిందు చేస్తూ సినిమా ఏకంగా 10 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. పైగా ఇతర రైట్స్ ద్వారా మరో 5 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది.
మొత్తంగా నిర్మాత ఉషా మాల్పురికి ఏకంగా అయిదు కోట్ల వరకు లాభం వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆర్ధిక లాభం విషయం పక్కన పెడితే ఈ చిత్రంతో నాగశౌర్య ఇమేజ్ భారీగా పెరిగింది. ఆయన స్థాయి కూడా పెరిగింది. ఇకపై నాగశౌర్య సినిమాకు 10 కోట్లు పెట్టినా వచ్చే అవకాశం ఉందని నిర్మాతలు భావిస్తారు. అలాగే శౌర్య పారితోషికం కూడా భారీగా పెరిగింది. అందుకే ‘ఛలో’ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికి ఉషా మాల్పురి ప్రత్యేక కానుకలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దర్శకుడు వెంకీ అట్లూరి నుండి లైట్ బాయ్స్ వరకు అందరికి కూడా వారి హోదాకు తగ్గట్లుగా వచ్చిన లాభాల్లో వాటాను ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఇలా నిర్మాత ఉషా మాల్పురి మంచి మనసును చాటుకుంటున్నారు.