Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వివాదాల దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించి, విడుదల చేసిన వంగవీటి సినిమా ఇంకా వర్మకు ఇబ్బందులు తెచ్చి పెడుతూనే ఉంది. ఆ సినిమా విడుదలై చాలా నెలలు గడుస్తుంది. అయినా ఇంకా కూడా ఆ వివాదం నడుస్తూనే ఉంది. ‘వంగవీటి’ సినిమా మొదలు పెట్టిన సమయంలో వర్మను అడ్డుకోవాలంటూ వంగవీటి కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు వాద ప్రతివాదనలు విన్న తర్వాత ఇన్నాళ్లకు కేసు బుక్ చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించడం జరిగింది. వంగవీటి కుటుంబ సభ్యుల ఆవేదనలో నిజం ఉందని, వర్మ చేసింది తప్పు అంటూ కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.
వెంటనే వర్మపై కేసు బుక్ చేసి అరెస్ట్ చేయాల్సిందిగా కోర్టు పోలీసులను ఆదేశించింది. దాంతో పోలీసులు త్వరలోనే వర్మను అదుపులోకి తీసుకునేందుకు సిద్దం అవుతున్నారు. అయితే వర్మ ముందస్తు బెయిల్ తీసుకుని అరెస్ట్ నుండి బయట పడే అవకాశాలున్నాయిన తెలుస్తోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే వర్మ తరపు లాయర్‌లు ముందస్త బెయిల్ కోసం కోర్టులో పిటీషన్ వేయడం జరిగింది. మొత్తానికి వంగవీటి విడుదలైన తర్వాత కూడా ఇంకా వివాదం కొనసాగుతూనే ఉండటంతో ఆయన అభిమానులు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు