ఎమ్మెల్యే అనితను కూడా వదలని వర్మ

varma-reply-to-tdp-mla-anitha-over-lakshmis-ntr-movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

వివాదాల దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ వివాదాలను క్రియేట్‌ చేసేందుకే సినిమాలు తీస్తూ ఉంటాడని కొందరు ఆరోపిస్తూ ఉంటారు. ఆ మాట నిజమేనా అన్నట్లుగా ఆయన కొన్ని సినిమాలు ఉన్నాయి. మొన్నటికి మొన్న వంగవీటి చిత్రాన్ని తెరకెక్కించి పెను వివాదంను సృష్టించిన వర్మ ఇప్పుడు లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ అంటూ ప్రకటించి పెద్ద వివాదానికి తెర లేపాడు. ఖచ్చితంగా వర్మ ఆ సినిమాలో తెలుగు దేశం పార్టీకి వ్యతిరేకంగా ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా చూపించబోతున్నాడు.

వైకాపా నాయకులు ఆ సినిమా వెనుక ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కారణం వైకాపా నాయకుడు ఆ సినిమాకు నిర్మాత అవ్వడమే. వైకాపా మద్దతుతో వర్మ ఆ సినిమా చేస్తున్నాడంటూ టీడీపీ నాయకులు తీవ్ర స్థాయిలో వర్మపై విరుచుకు పడుతున్నారు. మొదట రాజేంద్రప్రసాద్‌ ఆ తర్వాత నిన్న మొన్న మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డిపై తీవ్ర స్థాయిలో వర్మ విమర్శలు చేశాడు. తాజాగా తనను టార్గెట్‌ చేసిన టీడీపీ ఎమ్మెల్యే అనితను సైతం వర్మ వదిలి పెట్టలేదు. ఆమె మీడియా సమావేశంలో తనపై చేసిన ప్రతి ఒక్క విమర్శకు ఫేస్‌బుక్‌లో సమాధానం ఇచ్చాడు. ఆమె విమర్శ ఏంటి, తన కౌంటర్‌ ఏంటి అంటూ ఫేస్‌బుక్‌లో పాయింట్‌ టు పాయింట్‌ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు. వర్మ చేసిన పోస్ట్‌ ఉన్నది ఉన్నట్లుగా మీకోసం..

టీడీపీ ఎమ్మెల్యే అనిత గారికి నా సమాధానాలు:

టీడీపీ ఎమ్మెల్యే అనిత:
ఎన్టీఆర్ పైన వర్మ తీస్తున్న సినిమాలో చరిత్రను వక్రీకరించవద్దు
అనిత గారు బయట తెలిసిన చరిత్ర వెనుక లోపలి అసలు చరిత్ర చూపించడమే నా అసలు సిసలు ఉద్దేశం
టీడీపీ ఎమ్మెల్యే అనిత:
ఎన్టీఆర్ మహానుభావుడు…ఆయన పేదలకు ,ప్రజలకు చేసిన మంచిని వర్మ తన సినిమాలో చూపించాలి.
అనితగారు ఈ సినిమా బయోపిక్ కాదు..కేవలం లక్ష్మి పార్వతి గారు ఆయన జీవితం లో ప్రవేశించినప్పటినుంచీ తుది వరకూ
టీడీపీ ఎమ్మెల్యే అనిత:
ఎన్టీఆర్ కీర్తికి భంగం కలిగేలా ఎవరు సినిమా తీసిన టీడీపీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు చూస్తూ ఊరుకోరు.
అనితగారు ఇలాంటి వార్నింగ్ లు టీడీపీ పుట్టకముందునుంచి విని విని విసుగెత్తిపోయాను
టీడీపీ ఎమ్మెల్యే అనిత:
రాజకీయంగా చంద్రబాబును ఎదుర్కోలేకే..వైసీపీ నేతలు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీస్తున్నట్లు ఉంది..
లోగుట్టు పెరుమాళ్ళకెరుక
టీడీపీ ఎమ్మెల్యే అనిత:
చనిపోయిన ఎన్టీఆర్ పైన సినిమా తీసి టీడీపీని ఇబ్బంది పెట్టాలని వైసీపీ నేతలు అనుకుంటే…బ్రతికి ఉన్న జగన్ పైన కూడా సినిమా తీసే వాళ్ళు ఉన్నారు..జగన్ జీవిత చరిత్ర ప్రజలకు సినిమా రూపంలో చూపిస్తే..ఆయన పాదయాత్ర కూడా చెయ్యలేరు..
అనితగారు మీరు సూపరు ..నాకు తెలిసి ఇలాంటి స్క్రిప్ట్ ఐడియా షోలే రైటర్ సలీమ్ జావేద్ కి కాని బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారికి కూడా వచ్చిఉండదు 🙏🙏
టీడీపీ ఎమ్మెల్యే అనిత:
మహానుభావుల్లో ఉన్న మంచినే తీసుకోవాలి… అదే సమజాహితo
ఆహా క్లాప్సు విజిల్స్ !!!💐💐💐