వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గత సంవత్సరంలో ట్విట్టర్‌కు గుడ్‌బై చెబుతున్నాను అంటూ తన ట్విట్టర్ అకౌంట్‌ను డిసేబుల్ చేశాడు. అప్పటి నుండి ఫేస్‌బుక్ నుండి ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటున్నాడు. ఫేస్‌బుక్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటూ వస్తున్న వర్మ తాజాగా కొత్త సంవత్సరం సందర్బంగా అంటూ మళ్లీ ట్విట్టర్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. జనవరి 2వ తారీకున వర్మ తన మొదటి ట్వీట్‌ను చేశాడు. అజ్ఞాతవాసి స్ఫూర్తితో అంటూ వర్మ చేసిన ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షించింది. పవన్ కళ్యాణ్ తన రాజకీయ విషయాలను తెలియజేసేందుకు ఒక అకౌంట్‌ను, సినిమాల విషయాలను వెళ్లడి చేసేందుకు ఒక అకౌంట్‌ను మెయింటెన్ చేస్తున్నాడు.
పవన్ రెండు ట్విట్టర్ అకౌంట్‌లు మెయింటెన్ చేస్తున్న నేపథ్యంలో తాను కూడా ట్విట్టర్‌లో ఉండాలనే ఉద్దేశ్యంతో రీ ఎంట్రీ ఇచ్చాను అంటూ సన్నిహితుల వద్ద చెబుతూ వస్తున్నాడు. ట్విట్టర్‌పై బోర్ కొట్టిన తాను ఆ మద్య ట్వీట్స్‌ను చేయడం మానేశాను అని, పులి చారలను, పాము కోరలను వదిలేస్తే వాటికి విలువ ఉండదు. అలాగే తాను ట్విట్టర్‌ను వదిలేయడం వల్ల విలువ ఉండదనే ఉద్దేశ్యంతో మళ్లీ ట్విట్టర్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చాను అంటూ చెప్పుకొచ్చాడు. వర్మ ట్విట్టర్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వడంను పలువురు స్వాగతిస్తున్న నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ మళ్లీ తల పట్టుకున్నారు. మళ్లీ మెగా ఫ్యామిలీ గురించి ముఖ్యంగా పవన్ గురించి వర్మ పిచ్చి కూతలు కూస్తాడని వారు ఆందోళన చెందుతున్నారు.