Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
లోకానికి తెలిసి వెంకయ్య నాయుడికి ఇద్దరే పిల్లలు. కూతురు దీపా వెంకట్.. స్వర్ణభారతి ట్రస్ట్ వ్యవహారాల్లో ఎప్పుడూ బిజీగా ఉంటారు. ఇక కుమారుడు హర్షవర్థన్.. హర్ష టయోటా పేరుతో ఎన్నో షోరూములు నిర్వహిస్తున్నారు. కానీ వెంకయ్యకి మూడో బిడ్డ కూడా ఉందని ఈ మధ్యే ఆయన భార్య సీక్రెట్ రివీల్ చేశారు. అదెవరో కాదట స్వర్ణభారతి ట్రస్టే ఆయన మూడో బిడ్డట.
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులపై ఆసక్తి లేదని చెప్పిన వెంకయ్య.. ఉషాపతిగానే సంతోషంగా ఉన్నట్లు ప్రాస పేల్చారు. ఇప్పుడు ఆయన శ్రీమతి కూడా వెంకయ్యకు దీటుగా కౌంటర్ ఇచ్చారని వెంకయ్య అభిమానులు ముచ్చట పెడుతున్నారు. త్వరలో ఉపరాష్ట్రపతి కుర్చీలో కూర్చోబోతున్న వెంకయ్య వ్యక్తిగత విషయాలు ఉష ద్వారా బయటకు వచ్చాయి.
పిల్లల్ని చాలా స్ట్రిక్ట్ గా పెంచిన వెంకయ్య.. మనవల దగ్గరికి వచ్చే సరికి రిలాక్సేషన్లు ఇచ్చేస్తున్నారట. స్కూలు మానేస్తామన్నా పర్లేదులే అంటున్నారట. దీంతో దీప, హర్షవర్థన్ కు టెన్షన్ పెరిగిపోతోందట. పిల్లలకు ఎలా నచ్చజెప్పాలో తెలియక సతమతమైపోతున్నారట. వెంకయ్య ఇంట్లో అయినా, బయటైనా అలాగే ఉంటారని, ముక్కుసూటిగా మాట్లాడతారని మురిసిపోతున్నారు ఉష.
మరిన్నివార్తలు






