అర్జున్‌ రెడ్డి మాటలు శృతిమించుతున్నాయి

Vijay Devarakonda Controversy Speech At Arjun Reddy Movie Pre Release Event

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

‘పెళ్లి చూపులు’ చిత్రంతో ఒక్కసారిగా స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న విజయ్‌ దేవరకొండ తాజాగా ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రాన్ని చేసిన విషయం తెల్సిందే. ఈ సినిమా ప్రారంభం సమయంలోనే ఒక లిప్‌లాక్‌ సీన్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. లిప్‌లాక్‌తో పాటు చిన్న టీజర్‌తో సినిమాపై అంచనాలను అమాంతం పెంచారు. సినిమా పూర్తి అయ్యి ఈవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆడియో విడుదల సందర్బంగా ఈ చిత్రం ఖచ్చితంగా సూపర్‌ హిట్‌ అవుతుంది, ఎవరైనా బెట్‌ కాస్తారా అంటూ విజయ్‌ ఛాలెంజ్‌ చేయడం అందరికి షాక్‌ ఇచ్చింది. ఇక తాజాగా విజయ్‌ చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి.

ఈ వారంలో ‘అర్జున్‌ రెడ్డి’ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్‌ వేడుకను వైభవంగా నిర్వహించడం జరిగింది. ఆ వేడుకలో విజయ్‌ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. సోషల్‌ మీడియాలో తనపై వచ్చిన విమర్శలకు స్టేజ్‌ పై నుండే కామెంట్స్‌ చేయడంతో పాటు, ప్రతి ఒక్కరిని వదలకుండా విమర్శలు చేయడంతో అర్జున్‌ రెడ్డి దూకుడుగా ఉన్నాడనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సినిమాల్లో ఆ దూకుడు పర్వాలేదు. కాని రియల్‌ లైఫ్‌లో ఇలాంటి దూకుడు ఎంత మాత్రం సమంజసం కాదు అంటూ అర్జున్‌ రెడ్డి ఫ్యాన్స్‌ కూడా అంటున్నారు. ఇటీవల కాంగ్రెస్‌ నేత ముద్దు సీన్‌పై అభ్యంతరం చెప్పడంతో ఆయనను చిల్‌ తాతయ్య అంటూ వెక్కిరించడం కూడా విజయ్‌ చేసిన తప్పుగా చెప్పుకోవచ్చు. మొత్తానికి విజయ్‌ దేవరకొండ మాటలు శృతిమించుతున్నాయి.


మరిన్ని వార్తలు:

‘అర్జున్‌ రెడ్డి’కి అదే పెద్ద మైనస్‌ అయ్యేలా ఉంది

స్పైడ‌ర్ లో బ్రిజేశ్ శాండల్య పాట‌

నెల ముందే పూర్తి చేసిన ఎన్టీఆర్‌