విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ చిత్రాల తర్వాత నటిస్తున్న చిత్రం ‘నోటా’. ఈ చిత్రం తెలుగు మరియు తమిళంలో ఒకే సారి తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ రాజకీయ నేపథ్య చిత్రంను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 6న ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. సినిమాలో సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తున్న కారణంగా తమిళంలో కూడా భారీ అంచనాలున్నాయి. తెలుగులో విజయ్ దేవరకొండ స్థాయి ప్రస్తుతం పీక్స్‌లో ఉంది. దాంతో తెలుగులో ఈ సినిమాకు భారీగా బిజినెస్ అవ్వడం చాలా సహజం. కాని తమిళనాట కూడా ఈ చిత్రంకు మంచి క్రేజ్ ఉంది.
గ్రీన్ స్టూడియో జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రంకు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. యూత్‌లో విపరీతమైన క్రేజ్‌ను దక్కించుకున్న విజయ్ దేవరకొండ ‘గీత గోవిందం’ వచ్చిన వెంటనే ఈ చిత్రంతో రాబోతున్న కారణంగా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. గీత గోవిందం వంటి ప్రేమ కథ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి, ఇప్పుడు హఠాత్తుగా రాజకీయ నేపథ్యం చిత్రంతో రావడం అనేది సాహస నిర్ణయమే. అయినా కూడా విజయ్ దేవరకొండ దర్శకుడు ఆనంద్ శంకర్‌పై నమ్మకంతో ఈ చిత్రంను చేయడం జరిగింది. అన్ని అనుకున్నట్లుగా జరిగి చిత్రీకరణ పూర్తి అయ్యిందని, ట్రైలర్‌ను విడుదల చేసి, అక్టోబర్ 4న తెలుగు మరియు తమిళంలో సినిమాను విడుదల చేస్తాం అంటూ ప్రకటించారు. నోటా చిత్రం విజయ్ కెరీర్‌లో ఎలాంటి చిత్రంగా నిలుస్తుందో చూడాలి.