ఈ మద్య జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ లో తెరాస పార్టీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ అధికారంలోకి వచ్చింది. ప్రజకుటమికి తెరాస నుండి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెరాస అధికారంలోకి రాగానే సినిమా రంగానికి చెందినా ప్రముఖులు, వ్యాపార వేత్తలు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. సూపర్ స్టార్ కృష్ణ ఏకంగా కెసిఆర్ కి శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రెస్ నోటు ను విడుదల చేశాడు. అలాగే మహేష్ బాబు కూడా కేటిఆర్ కు ట్విట్టర్ వేధికగా గ్రీటింగ్స్ తెలిపారు. రామ్ గోపాల్ వర్మ కూడా తనదైనా స్టైల్ లో కెసిఆర్ గారు అందరి హీరోస్ కంటే అందగాడని. ఇప్పుడు హీరోయిన్స్ కంటే చాలా అందంగా కనపడుతున్నాడు అంటూ ట్విట్ చేశాడు. విజయ్ దేవరకొండ విషయానికి వస్తే మాత్రం తనకు ఇష్టమైన నాయకుడు కెసిఆర్ గారు అని తనను మరల cm గా చుడలనుకుంటున్నానని చాలా సందర్బలో చెప్పుకుంటూ వచ్చాడు.
తెలంగాణాలో ఓటింగ్ ప్రక్రియ జరుగుతున్నపుడు సెలబ్రిటీస్ అందరు తమ వోటు హక్కును వినియోగించుకుంటే, విజయ్ మాత్రం ఆ రోజు ఓటు వేశాడా అనే సందేహం అందరి మదిలోను మొదలైంది. డబ్బులు తీసుకోకుంట వోటు వెయ్యాలని ప్రమాణం చేయించిన విజయ్ వోటు వెయ్యడానికి రాకపోవడం గమనర్హం. విజయ్ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ షూటింగ్ పనులతో చాలా బిజీగా ఉన్నాడు అంటున్నారు అందరు. మరో విషయం ఏమిటి అంటే తను కావాలనే రాజకీయాలకు దూరం గా ఉంటున్నాడని తెలుస్తుంది. ఎందుకంటే తను ఇప్పుడు రెండు రాష్ట్రాల ను టార్గెట్ చేస్తున్నాడు కావున తను తెరాస పార్టీకి చెందినవాడిని కాదని నిరుపించుకోవడానికి రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు. ఒక్క పార్టీని సపోర్ట్ చేస్తూ మరో పార్టీకి తిట్టడం వలన తన సినిమా కెరీర్ దెబ్బతినే అవకశాలు ఎక్కువగా ఉంటాయి కావున రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు తన సన్నిహితుల ద్వార తెలుస్తుంది.