విజయ్‌దేవరకొండ, ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నోటా’. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం రూపొంది విడుదలకు సిద్దం అయ్యింది. ఈ చిత్రంకు ముందు ‘గీత గోవిందం’తో రికార్డు స్థాయిలో వసూళ్లను సాధించిన విజయ్ దేవరకొండ ఈ చిత్రంతో మరింతగా తన స్టార్డంను చాటుకుంటాడు అంటూ టాక్ వినిపిస్తుంది. ఈమద్య ‘భరత్ అనే నేను’ చిత్రంలో మహేష్‌బాబు సీఎంగా నటించిన విషయం తెల్సిందే. అయితే ఈ చిత్రంలో కూడా విజయ్ దేవరకొండ సీఎంగా కనిపించబోతున్న నేపథ్యంలో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రం ఉంటుందని దర్శకుడు చెబుతున్నాడు. ఇక అంతా అనుకుంటున్నట్లుగా ఈ చిత్రంలో విజయ్ పూర్తి స్థాయిలో సీఎంగా కనిపించడు అంటూ సమాచారం అందుతుంది.
‘నోటా’ చిత్రంలో కేవలం 20 నిమిషాలు మాత్రమే సీఎంగా కనిపిస్తాడు అంటూ సమాచారం అందుతుంది. క్లైమాక్స్‌లో మాత్రమే హీరో సీఎం అవుతాడని, 20 నిమిషాల పాటు సీఎంగా విజయ్ దేవరకొండ నటించి సినిమా స్థాయిని పెంచేశాడు అంటూ సమాచారం అందుతుంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్‌తో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళంలోనూ అంచనాను పెంచింది. భారీ ఎత్తున ఈ చిత్రంపై అంచనాలు పెంచడంలో సక్సెస్ అయిన దర్శకుడు సినిమాతో ఖచ్చితంగా నిరుత్సాహ పర్చడు అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. తెలుగు హీరో ఇప్పటి వరకు తమిళంలో మంచి స్టార్డంను దక్కించుకోలేదు. విజయ్ ఆలోటును తీర్చుతాడనే టాక్ వినిపిస్తుంది.