విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గీత గోవిందం’ చిత్రం కొన్ని సీన్స్ లీక్ అయిన విషయం తెల్సిందే. ఈమద్య కాలంలో లీక్ అనేది చాలా కామన్ అయ్యింది. అయితే సినిమా విడుదల సమయంలో కొన్ని సీన్స్ లీక్ అవ్వడం వల్ల ఖచ్చితంగా సినిమాపై చాలా ప్రభావం పడుతుంది. తాజాగా గీత గోవిందం సీన్స్ లీక్ అవ్వడంపై హీరో విజయ్ దేవరకొండ తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాడు. కొందరు నా ఎదుగుదలను చూసి ఓర్వలేక ఇలా చేశారు అంటూ విజయ్ దేవరకొండ చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. అర్జున్ రెడ్డి తర్వాత తన స్టార్డం పెరిగి పోవడాన్ని కొందరు జీర్ణిఇంచుకోలేక పోతున్నారు అని, అందుకే వారు ఇలాంటి పనులు చేస్తున్నారు అంటూ విజయ్ దేవరకొండ ఆరోపిస్తున్నాడు.
విజయ్ దేవరకొండ చేస్తున్న వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించినవి అనే విషయంలో సినీ వర్గాల్లో ప్రస్తుతం చర్చ కార్యక్రమం జరుగుతుంది. మెగా ఫ్యామిలీ నిర్మించిన ఈ మూవీని ఇతరులు ఎవరు లీక్ చేసేందుకు చూస్తారు అంటూ కొందరు అంటున్నారు. విజయ్ దేవరకొండుకు ఎవరిపై అనుమానం ఉందో మాత్రం తెలియడం లేదు. ఆయన ఎవరిని ఉద్దేశించి అలా మాట్లాడాడు అనే విషయం చిత్ర యూనిట్ సభ్యులు కూడా చెప్పలేక పోతున్నారు. చిత్ర నిర్మాత అల్లు అరవింద్ ఈ విషయమై కూల్‌గా ఉంటే విజయ్ దేవరకొండ ఎందుకు ఇంతగా ఎగ్జైట్ అవుతున్నాడో అర్థం కావడం లేదు. లీక్‌కు కారణం అయిన వారు తెలిస్తే వారిపై నేరుగా మాట్లాడవచ్చుగా అని కొందరు అంటున్నారు. దోషులు ఎవరో తెలిసినా కూడా విజయ్ దేవరకొండ చెప్పక పోవడం తప్పే అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న గీత గోవిందం చిత్రంపై లీక్‌ల ప్రభావం ఏ మేరకు ఉంటుందో చూడాలి.