పాటతో కూడా అదరగొట్టిన గోవిందం

Vijay Devarakonda sing What The F song in Geetha Govindam movie

‘అర్జున్‌ రెడ్డి’ చిత్రం తర్వాత యూత్‌ ఐకాన్‌గా మారిపోయిన విజయ్‌ దేవరకొండ త్వరలో ‘గీత గోవిందం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. వచ్చే నెల 15న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారీ ఎత్తున ఈ చిత్రం ప్రమోషన్స్‌ను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు అనూహ్యమైన స్పందన దక్కింది. టీజర్‌ భారీ ఎత్తున వ్యూస్‌ను రాబట్టిన నేపథ్యంలో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రంలోని ఒక పాటను విజయ్‌దేవరకొండ పాడటంతో అంచనాలు భారీగా పెరిగాయి.

ఇప్పటి వరకు నటుడిగా ఆకట్టుకున్న విజయ్‌ దేవరకొండ ఈ చిత్రంలో సింగర్‌గా కూడా మెప్పించాడు. వాట్‌ ద ఎఫ్‌ అంటూ ఆడవారి గురించి పాడిన పాట ప్రస్తుతం యూత్‌లో విపరీతంగా ఆధరణ దక్కించుకుంటుంది. భారీ ఎత్తున ఈ పాటకు వ్యూస్‌ దక్కుతున్నాయి. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ పాట మేకింగ్‌ వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఈ పాటకు యూట్యూబ్‌లో భారీ ఎత్తున వ్యూస్‌ దక్కించుకుంటుంది. సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతూ వస్తుంది.