Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘పెళ్లి చూపులు’, ‘అర్జున్ రెడ్డి’ చిత్రాలతో ఒక్కసారిగా టాలీవుడ్లో స్టార్ అయిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం మూడు నాలుగు చిత్రాలను చేస్తున్నాడు. ప్రతిష్టాత్మక గీతాఆర్ట్స్ బ్యానర్‌తో పాటు, వైజయంతి మూవీస్‌లో కూడా విజయ్ దేవరకొండ చిత్రాలు చేస్తున్న నేపథ్యంలో తెలుగులో ఈయన స్టార్‌గా మారడం ఖాయం అని అంతా భావిస్తున్నారు. అయితే ఈ సమయంలో విజయ్ దేవరకొండ తమిళంలో ఒక చిత్రానికి కమిట్ అవ్వడంతో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఒక హీరో తెలుగు మరియు తమిళం ఇలా పలు భాషల్లో గుర్తింపు తెచ్చుకోవడం మంచిదే. అయితే ఒకేసారి రెండు భాషల్లో చిత్రాలను చేస్తాను అనడం కరెక్ట్ కాదని, ముందు ఒక భాషలో సెటిల్ అయిన తర్వాత మరో భాషలో చిత్రం గురించి ఆలోచిస్తే బెటర్ అంటూ కొందరు సలహాలు ఇస్తున్నారు.
తమిళంలో విజయ్ దేవరకొండ తాజాగా ఆనంద్ శంకర్ అనే దర్శకుడి దర్శకత్వంలో నటించేందుకు కమిట్మెంట్ ఇచ్చాడు. ఈ దర్శకుడు గతంలో విక్రమ్‌తో ఇరుముగన్ అనే చిత్రాన్ని తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు. ఆనంద్ శంకర్ చెప్పిన కథ విజయ్ దేవరకొండకు నచ్చడంతో వెంటనే చేసేందుకు ఒప్పుకున్నాడు. మొదట తెలుగులో ఆ చిత్రాన్ని చేయాలని భావించినా కూడా దర్శకుడు శంకర్ మాత్రం తమిళంలో చేయాలని పట్టుబడుతున్నాడు. కథపై నమ్మకంతో దర్శకుడి ఆత్మవిశ్వాసంతో ఉండటంతో ఈ చిత్రాన్ని చేసేందుకు విజయ్ దేవరకొండ సిద్దం అయ్యాడు. మరి ఈ చిత్రం సక్సెస్ అయ్యి తమిళంలో విజయ్ దేవరకొండ పేరు తెచ్చుకుంటాడా లేదా తెలుగు మరియు తమిళం అంటూ రెండు పడవల ప్రయాణం చేసి బొక్క బోర్లా పడతాడా అనేది చూడాలి.