Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వైసీపీ ఎంపీ విజయసాయి లో అసహనం పెరిగిపోయింది. తాము ఎంతో ప్లాన్డ్ గా చేసిన అవిశ్వాసాన్ని చంద్రబాబు హైజాక్ చేయడంతో ఆయన ఒక్కసారిగా బరస్ట్ అయ్యారు. ఈ ఉదయం రాజ్యసభలో ప్రధాని మోడీకి పాదాభివందనం చేసి ఆశీర్వాదాలు తీసుకున్న వైనం బయటపడడంతో పాటు చంద్రబాబు పదేపదే తనని విజయ్ మాల్యా తో పోల్చడం విజయసాయి తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఒక అమ్మ అబ్బకి పుట్టివుంటే చంద్రబాబులా మాట్లాడరని విజయసాయి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పైగా ఒక్క బ్యాంకులో కూడా పైసా తీసుకొని తనను విజయ్ మాల్యాతో పోల్చడాన్ని విజయసాయి తప్పుబట్టారు. ఓటుకి నోటు కేసు సహా వివిధ అంశాల్ని విజయసాయి ప్రస్తావించారు.
రాజకీయాల్లో పరస్పర దూషణలు సహజం. అయితే వ్యక్తిగతంగా వెళ్లి భాషని అదుపు తప్పి వాడడం మాత్రం మంచిది కాదు. చంద్రబాబు దురదృష్టమో ఏమో గానీ పదేపదే ఈ తరహా వ్యాఖ్యలు సీఎం చంద్రబాబు భరించాల్సివస్తోంది. బాబు ప్రతిపక్ష నేతగా వున్నప్పుడు అప్పటి సీఎం వై.ఎస్ అసెంబ్లీ సాక్షిగా “అమ్మ కడుపున ఎందుకు పడ్డానా అని బాధపడేలా చేస్తా “ అని మాట్లాడారు. వై.ఎస్ హవా సాగుతున్న తరుణంలోనే గాలి జనార్దన్ రెడ్డి కూడా చంద్రబాబుని ఉద్దేశించి పత్రికలు రాయడానికి ఇబ్బంది పడే భాష వాడారు. ఆలా చంద్రబాబుని ఇబ్బంది పెట్టిన ఇద్దరిలో ఒకరు మరణించగా ఇంకోరు రాజకీయంగా కనుమరుగై ఇప్పుడు పునప్రాభవం కోసం ఎదురు చూస్తున్నారు. ఇటీవలే గాలి అప్పట్లో బాబు మీద చేసిన వ్యాఖ్యలకి పశ్చాత్త్తాపం ప్రకటించారు. ఇక ఇప్పుడు చంద్రబాబుని ఉద్దేశించి విజయసాయి అంతకు మించి మాట్లాడారు. చూద్దాం దీనికి విజయసాయి ఏ ఫలితం అనుభవిస్తారో ?