Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఓ 7 సంవత్సరాల ముందట విజయసాయిరెడ్డి అనే పేరు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ తెలియదు. వై.ఎస్ కుటుంబంతో దగ్గరి సంబంధాలు వున్నవారికి మాత్రమే కొద్దిగా తెలుసు. వై.ఎస్ మరణం తో జగన్ మీద కేసులు రావడంతో ఒక్కసారిగా విజయసాయి పేరు మార్మోగింది. జగన్ అవినీతి వెనుక ఉన్న మాస్టర్ మైండ్ విజయసాయి అని తెలియడంతో ఆయన కూడా బాస్ తో పాటు జైలు ఊచలు లెక్కపెట్టాల్సి వచ్చింది. మామూలుగా అయితే ఓ ఛార్టర్డ్ అకౌంటెంట్ కి ఇలా జరిగితే ఆయన కుంగిపోయి ఉండేవారు. కానీ విజయసాయి స్పెషల్. ఆయన ఇక పూర్తి స్థాయి రాజకీయ వేత్త అవతారం ఎత్తి పాలిటిక్స్ లోను జగన్ కి అండదండగా ఉంటున్నాడు. బీజేపీ తో జగన్ సత్సంబంధాలు ఏర్పాటు చేయడంలో విజయసాయిదే కీలక పాత్ర.
రాజకీయాలకు కొత్త అయినా మాస్టర్ ప్లాన్స్ వేయడంలో విజయసాయిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ప్రస్తుతం రాష్ట్రపతి పీఠాన్ని ఎక్కబోతున్న రాంనాథ్ కోవిద్ ని తెలుగు రాష్ట్రాల నుంచి అందరికన్నా ముందుగా కలిసింది విజయసాయి. ఆయన బీహార్ గవర్నర్ గా వున్నప్పుడే విజయసాయి ప్రత్యేకంగా పాట్నా వెళ్లి మరీ ఆయన్ని కలిశారు. అప్పట్లో ఆ భేటీ పరమార్ధం ఏమిటన్నది చాలా మందికి అర్ధం కాలేదు. కోవిద్ రాష్ట్రపతి అభ్యర్థి అని బీజేపీ ప్రకటించాక గానీ విజయసాయి నెట్ వర్క్ ఎంత బలంగా ఉంటుందో అర్ధం అయ్యింది.
ఓ ఏడాది ముందు ఉత్తరాఖండ్ లోని ఓ చిన్న రెస్టారెంట్ లో బీజేపీ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప తో విజయసాయి భేటీ అయ్యాడు. ఆ తర్వాత ఓ ఆర్సెస్ అగ్రనేగతో విజయసాయి రహస్య సమావేశం జరిగింది. ఆ తర్వాత కొద్ది నెలల వ్యవధిలో ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ జగన్ కి దొరికింది. ఇక రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ కి వైసీపీ ఏ స్థాయిలో మద్దతు పలికిందో చూసాం. ఇక ఇప్పుడు విజయసాయి నెట్ వర్క్ గుజరాత్ కి విస్తరించింది. మోడీ, అమిత్ షా ల సొంతగడ్డ గుజరాత్ లో విజయసాయి అడుగు పెట్టాడు. అక్కడ గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్ తో సమావేశం అయ్యారు. ఈ పరిణామం ఎక్కడికి దారి తీస్తుందో అనుకుంటే… ఆమె పేరు ఆంధ్రప్రదేశ్ కి కొత్త గవర్నర్ కావొచ్చని తెలుస్తోంది. ఏదేమైనా కేంద్రరాష్ట్రాల్లో సానుకూల ప్రభుత్వాలు లేకున్నా విజయసాయి నెట్ వర్క్ ఛేదిస్తున్న రాజకీయ రహస్యాలు చూస్తుంటే వామ్మో అనిపిస్తుంది.
మరిన్ని వార్తలు