Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
క్రికెట్, బాలీవుడ్ జంట విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ కలిసి నటించిన ఓ ప్రకటన సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ప్రముఖ వస్త్ర విక్రయ సంస్థ మోహే బ్రాండ్ కు అనుష్క ఇటీవల ప్రచార కర్తగా నియమితులయ్యారు. తమ సంస్థ కోసం అనుష్కశర్మ, కోహ్లీతో కలిసి ఓ ప్రకటనలో నటిస్తారని మోహే సంస్థ తెలిపింది. ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది ఆ సంస్థకు చెందిన ప్రకటనే అని భావిస్తున్నారు. అయితే మోహే సంస్థ అధికారికంగా దీన్ని ధృవీకరించలేదు. ప్రకటనలో కోహ్లీ, అనుష్క సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తున్నారు. వధూవరులు పెళ్లిలో చెప్పే ప్రమాణాలను ప్రకటనలో కోహ్లీ, అనుష్క చెప్పుకుంటున్నారు. చివరగా కోహ్లీ అనుష్కకు ప్రపోజ్ చేయగా…ఆమె కోహ్లీ ప్రేమను అంగీకరిస్తున్నట్టుగా ప్రకటన ఉంది. నిజజీవితంలో ప్రేమికులైన వీరు త్వరలోనే పెళ్లిపీటలెక్కుతారని అంతా భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఈ జంట పెళ్లి వేడుకకు సంబంధించిన యాడ్ లో నటించడంతో ఈ వీడియో నెట్ లో వైరల్ అవుతోంది.