Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ పెళ్లిపై వస్తున్న పుకార్లకు తెరపడడం లేదు. ఇటలీలో పెళ్లంటూ వచ్చిన వార్తలను అనుష్కశర్మ ప్రతినిధి అధికారికంగా ఖండించినప్పటికీ… ఎవరికీ నమ్మకం కుదరడం లేదు. తాజాగా అనుష్క తన కుటుంబ సభ్యులు తల్లి ఆశిమా శర్మ, తండ్రి కల్నల్ అజయ్ కుమార్ , సోదరుడు కర్నేష్ తో కలిసి ఇటలీ వెళ్తూ మీడియా కంటికి చిక్కారు. దీంతో వారి పెళ్లి ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. పెళ్లికోసమే ఇటలీ వెళ్తున్నారా అని మీడియా ప్రతినిధుల వేసిన ప్రశ్నలకు అనుష్క, ఆమె కుటుంబం కానీ ఎలాంటి సమాధానం ఇవ్వకుండానే వెళ్లిపోయారు.
విరాట్ శ్రీలంకతో వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి కోరడం, అటు అనుష్క కూడా షారూఖ్ తో కలిసి నటిస్తున్న సినిమా షూటింగ్ నుంచి విరామం తీసుకోవడంతో వారిద్దరూ ఇటలీలో పెళ్లిచేసుకోనున్నట్టు వార్తలొచ్చాయి. తాజాగా పెళ్లి వేడుక స్విట్జర్లాండ్ లో జరగనున్నట్టు మరో వార్త వినిపిస్తోంది. ఈ నెల 10, 12 తేదీల మధ్య పెళ్లిజరిగే అవకాశం కనిపిస్తోంది… అటు ఇరుకుటుంబాల స్నేహితులు, సన్నిహితులుకు ఆహ్వాన పత్రికలు వెళ్లినట్టు తెలుస్తోంది. ఢిల్లీ టీమ్ కి కోచ్ గా ఉన్న విరాట్ చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ శిష్యుడి పెళ్లికోసమే సెలవు పెట్టాడన్న ప్రచారం జరుగుతోంది… పెళ్లి రహస్యంగా చేసుకుంటున్నప్పటికీ… ముంబైలో నవదంపతులు గ్రాండ్ గా రిసెప్షన్ ఇవ్వనున్నట్టు కొన్ని వర్గాలు చెబుతున్నాయి.