తీవ్ర వాయుగుండంగా మారింది వాయుగుండం. పశ్చిమ మధ్య బంగాళఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్ కెపురాకు 780 కిలోమీటర్ల, విశాఖకు 380 కిలో మీటర్ల , పారాదీప్ 480కిలో మీటర్ల, పశ్చిమ బెంగాల్ దీఘా కు దక్షిణముగా 630 కిలోమీటర్ల దూరములో వాయుగుండం కేంద్రీకృతమైంది. గడచిన 6 గంటల్లో 13 కిలోమీటర్ల వేగంతో పయనిస్తున్నది తీవ్ర వాయుగుండం.
ఇక రేపు తీవ్ర వాయుగుండంగా పశ్చిమ బెంగాల్ తీరం మోన్గ్లా ఖేపురా మధ్య తీరం దాటే ఆవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వీటి ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చాల చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే భారీ వర్షాలు అవకాశం ఉంది. తీరం వెంబడి గాలులు 45-55 కిలోమీటర్లు వేగంతో వీచే ఆవకాశం ఉందని సమాచారం. ఈ తరుణంలో మత్సకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు అధికారులు. విశాఖపట్నం, నిజంపట్నం, కృష్ణపట్నం, మచిలీపట్నం పోర్టులకు ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చిరిక జారీ జారీ చేశారు. కాకినాడ, గంగవరం పోర్టుకు రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.