ప్రకాష్ రాజ్ చేసిన తప్పేంటి..? ఎందుకు ఇన్ని సార్లు బ్యాన్ అవుతున్నారు..?

ప్రకాష్ రాజ్ చేసిన తప్పేంటి..? ఎందుకు ఇన్ని సార్లు బ్యాన్ అవుతున్నారు..?
Latest News

ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రకాష్ రాజ్ . చాలామంది టాప్ దర్శక, నిర్మాతలు వాళ్ళ మూవీ లో ప్రకాష్ రాజ్ వుండాలని అనుకుంటారు. ప్రకాష్ రాజ్ కి అభిమానులు కూడా ఎక్కువగానే ఉన్నారు . అయితే ప్రకాష్ రాజ్ మంచి నటుడు ఉన్నా దర్శకులకి మాత్రం పెద్ద బరువుగా మారిపోయారు ప్రకాష్ రాజ్. ఆయన మూవీ లో నటించాలంటే ఎన్నో కండిషన్స్ పెడుతూ ఉంటారంట లేదంటే ఆయన చేసే గొడవలు కూడా భరించాల్సి వస్తుందంట . ఈ విషయాన్ని చాలామంది అధికారికంగా ఇప్పటికే చెప్పారు.

ప్రకాష్ రాజ్ చేసిన తప్పేంటి..? ఎందుకు ఇన్ని సార్లు బ్యాన్ అవుతున్నారు..?
Prakash Raj

అనధికారికంగా ప్రకాష్ రాజ్ ని బ్యాన్ చేస్తూ ఉన్నారు. షూటింగ్ కి టైం కి ఎప్పుడు కూడా ప్రకాష్ రాజ్ రాడట. రాగానే ఏదో ఒక గొడవ పెట్టుకుంటారట. దర్శకుడు చెప్పినట్లు కూడా సరిగ్గా చేయరట. కెమెరా స్విచ్ ఆన్ అయితే చాలు అతనిలో ఇంకో కోణం బయటికి వస్తుంది ప్రకాష్ రాజ్ క్లోజ్ ఫ్రెండ్ కృష్ణవంశీ చాలాసార్లు ఆయనని సినిమాలో పెట్టుకుంటే పని అయిపోయినట్లే అని చెప్పారు. ఆగడు సినిమా టైంలో సోను సూద్ ప్లేస్ లో ప్రకాష్ రాజ్ ని అనుకున్నారు. కానీ శ్రీను వైట్ల ప్రకాష్ భరించలేక ఆయన సీన్స్ ని అన్నీ కూడా తీసేసి సోనుసూద్ ని పెట్టుకుని మూవీ ని పూర్తి చేశారట. ఇలా చాలా సందర్భాల్లో ప్రకాష్ రాజ్ బ్యాన్ అవుతూ వచ్చారు.