Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నంద్యాల ఫలితాలు వచ్చేశాయి. టీడీపీ ఉత్సాహంగా ఉంది. ఇక కాకినాడలో పోలింగ్ జరుగుతోంది. ఇప్పుడు నంద్యాలలో గెలిచేవారిదే డబుల్ అడ్వాంటేజ్ అవుతుందని అందరూ అనుకుంటున్నారు. నిజంగా నంద్యాల ఫలితం వస్తుందా.. లేదంటే ముద్రగడ ఫ్యాక్టర్ ఉంటుందా అనే చర్చ మొదలైంది. నంద్యాలలో కాపు ఫ్యాక్టర్ పనిచేయకపోయినా.. కాకినాడలో పనిచేస్తోందని జగన్ ఆశలు పెట్టుకున్నారు.
కానీ ముద్రగడను అతిగా నమ్ముకుంటే ఏం జరుగుతుందో జగన్ కు సరిగా తెలియదు. ఎందుకంటే ముద్రగడ ఎప్పుడూ జనం నమ్మిన నేత కాదు. ఆయన తన పాలిటిక్స్ కోసం పార్టీలు మారి, పదవులు అనుభవించారు కానీ.. ఎప్పుడూ విశ్వసనీయత పెంచుకోలేదు. పైగా కాపుల్లో కూడా ముద్రగడ పాదయాత్ర జోక్ అయిపోయింది. అలాంటి నేతను పట్టుకుని గెలవాలనుకోవడం జగన్ చేస్తున్న పెద్ద తప్పు.
జగన్ ప్రతిసారీ పనికిమాలిన స్ట్రాటజీలతోనే ఫెయిలవుతున్నారు. గెలవాల్సిన చోట కూడా ఓటమి కొనితెచ్చుకుంటున్నారు. ప్రచారంలో అవసరానికి మించిన దూకుడు, అతి విశ్వాసమే కొంపముంచుతున్నాయి. కచ్చితంగా కాకినాడలో టీడీపీకి డబుల్ అడ్వాంటేజ్ ఉంటుందని అందరూ చెబుతున్నా కూడా.. వైసీపీ మాత్రం దింపుడు కళ్లెం ఆశలు పెట్టుకోవడం జగన్ అనుభవలేమికి నిదర్శనం.
మరిన్ని వార్తలు: