సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా హీరోగా రానిస్తూ టాలీవుడ్ టాప్ హీరోస్ సరసన నిలిచాడు. మరో వైపు నిర్మాతగా సినిమాలు నిర్మిస్తున్నాడు. షూటింగ్ మద్యలో కొంత గ్యాప్ దొరికినచాలు యాడ్స్ చేస్తూ చాలా డబ్బులు సంపాదిస్తున్నాడు. ఇప్పుడు మహేష్ కు ఉన్న ఫాలోయింగ్ కి ఇంకో 15 ఇయర్స్ వరకు అతని కెరీర్ కు ఏలాంటి డోకా లేదు. కానీ అంతటి తో సంతృప్తి చెందని మహేష్ ఏసియన్ తో జతకట్టి మల్టీ ఫ్లెక్స్ రంగం వైపు అడుగులు వేశాడు. హైదరాబాద్ లోని గచ్చిబౌలి లో ఎయంబి పేరుతో మల్టీ ఫ్లెక్స్ థియేటర్ ను రూపొందించాడు. ఇప్పుడు అన్ని జిల్లాలోను అండ్ మెట్రో పాలిటిన్ సిటీ లోను ఎయంబి ని విస్తరింపజేసే పనిలో ఉన్నాడు మహేష్. కానీ మహేష్ ఎయంబి ఆలోచనకు పునాది వేసింది అయన భార్య నమ్రత శిరోద్కర్.
ఎందుకు అంటే ఎన్ని సినిమాలు తీసిన ఏమి లాభం సరైన థియేటర్స్ దొరక్కపోతే చాలా కష్టం. అగ్ర నిర్మాతలైన అల్లు అరవింద్, సురేష్ బాబు లు వాళ్ళు నిర్మాతలుగా రానిస్తూ వాళ్ల చేతిలో థియేటర్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు నిర్మించిన సినిమాలు ఎక్కువ రోజులు అందులో ఆడించి ఆ హీరోస్ కు గుర్తింపు తీసుకువస్తున్నారు. అందుకే బన్నీ, శిరీష్ రానా వెంకటేష్ వీళ్ళ సినిమాలు ఎక్కువ రోజులు థియేటర్స్ లో అడుతాయి. అందుకే మహేష్ బాబు ని కూడా మల్టీ ఫ్లెక్స్ రంగం వైపు అడుగులు వేయించింది నమ్రత. ఒక్కవేల మహేష్ కెరీర్ కొంచెం డౌన్ లో ఉన్నప్పుడు ఎవరు మరవకుండా ఎక్కువరోజులు థియేటర్స్ లో ఆడించవచ్చు. అందుకే నమ్రత మహేష్ ని మల్టీ ఫ్లెక్స్ రంగం వైపు అడుగులు పడేలా చేసింది. ఇది ఎయంబి మల్టీ ఫ్లెక్స్ వెనకున్న రహస్యం.