ఆంధ్రప్రదేశ్ లో ఘోరం చోటు చేసుకుంది. ఆస్తి కోసం ప్రియుడితో కలిసి ఓ మహిళ తన మాజీ భర్తను అతి దారుణంగా చంపేసిన ఘటన విజయవాడలో వెలుగు చూసింది. అయితే బిహార్‌కు చెందిన దినేష్‌కుమార్ సింగ్.. 14 ఏళ్ల క్రితం విజయవాడకు వలస వచ్చి స్థిరపడి పోయాడు. అలాగే.. ఎనికేపాడులోని ఒక చెప్పుల తయారీ సంస్థలో పనిచేసే అతనికి భార్య చింతాసింగ్, కుమారులు సత్యం శివం, లక్ష దీప్ ఉన్నారు. దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో రెండేళ్ల కిందట విడాకులు తీసుకున్నారు. పిల్లల మైనార్టీ తీరే వరకు తల్లి వద్దే ఉంచాలని కోర్టు స్పష్టం చేసింది.
అయితే దినేష్‌కుమార్ సింగ్ కు ప్రసాదంపాడులో సొంత ఇల్లు ఉంది. ఆ ఇంటిలోనేపై అంతస్తులో చింతాసింగ్, పిల్లలు, కింద అంతస్తులో దినేష్‌కుమార్ ఉండాలని న్యాయస్థానం వెల్లడించింది. దీంతో రెండేళ్లుగా అదే ఇంట్లో వేర్వేరుగా ఆ ఇద్దరూ నివాసం ఉంటున్నారు. చింతా సింగ్ రామవరప్పాడులోని ఓ బేకరిలో పనిచేస్తుండగా.. దినేష్ తన ఇంట్లోనే చెప్పులు తయారుచేసి అమ్ముతుండేవాడు. కాగా పిల్లల పోషణ ఖర్చులు తల్లి భరిస్తుండగా.. స్కూల్ ఫీజులు తండ్రి చెల్లిస్తున్నాడు.