Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గత సంవత్సరం బాలకృష్ణ నటించిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ మరియు ‘పైసా వసూల్’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రెండు చిత్రాల్లో గౌతమి పుత్ర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. పైసావసూల్ మాత్రం పెద్దగా ఆకట్టుకోలేక పైసల్ వసూళ్ చేయలేక పోయింది. గౌతమిపుత్ర శాతకర్ణి మంచి టాక్‌ను తెచ్చుకున్నా ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టలేక పోయింది. కారణం అదే సమయంలో చిరంజీవి ఖైదీ నెం.150 మరియు శతమానంభవతి చిత్రాలు ఉన్నాయి. ఆ రెండు సినిమాలకు పోటీగా నిలవడంతో కలెక్షన్స్ తగ్గాయని ట్రేడ్ విశ్లేషకుల అంచనా. ఇక ఈ సంక్రాంతికి పెద్ద పోటీ అనుకున్న అజ్ఞాతవాసి నెగటివ్ టాక్‌ను తెచ్చుకుంది. రంగుల రాట్నం చిత్రం పెద్దగా ఆకట్టుకుంటుందనే నమ్మకం లేదు.
సంక్రాంతి సీజన్‌ను వినియోగించుకోవాలి అంటే జైసింహా కాస్త పాజిటివ్ టాక్ దక్కించుకుంటే చాలు బాలయ్య కెరీర్లో రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్ రాబట్టవచ్చు అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జైసింహా పాజిటివ్ టాక్‌ను దక్కించుకున్నట్లయితే సునాయాసంగా 50 కోట్ల షేర్‌ను బాలయ్య వసూళ్లు సాధిస్తాడని, అయితే ఈ అవకాశంను ఆయన వినియోగించుకుంటాడా లేదా అనేది చూడాలి. దర్శకుడు కేఎస్ రవికుమార్ గత కొంత కాలంగా సక్సెస్‌లు లేవు. బాలకృష్ణ డబుల్ రోల్లో నటించడంతో పాటు సంక్రాంతి సీజన్ బాలయ్యకు సెంటిమెంట్. అందుకే ఈ సినిమాపై నందమూరి ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. తప్పకుండా బాలయ్య రేంజ్‌ను పెంచేలా ఈ చిత్రం వసూళ్లు సాధిస్తుందని, అజ్ఞాతవాసి లోటును ఈ చిత్రం భర్తీ చేసి సంక్రాంతికి సందడి చేస్తుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. రేపు విడుదల కాబోతున్న జైసింహా ఫలితం ఏంటీ అనేది మరి కొన్ని గంటల్లో తేలిపోయే అవకాశం ఉంది.