Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకి మంత్రి నారాయణ ఎంత సన్నిహితుడో వేరే చెప్పక్కర్లేదు. ఓ దశలో ఆయన్ని బాబు కుడిభుజంగా చెప్పుకున్నారు. ఇక 2014 ఎన్నికల్లో గెలిచాక నారాయణ బాబు క్యాబినెట్ లో నెంబర్ 2 గా, అనధికారికంగా చెలామణి అయ్యారు. అలాంటి నారాయణ ప్లేస్ లోకి ఇప్పుడు మాజీ ఎంపీ లగడపాటి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అలా ఎందుకు …నారాయణ,బాబు మధ్య ఏమైనా విభేదాలు వచ్చాయా అని ఆశ్చర్యపోకండి. ఒకప్పుడు నారాయణ బాధ్యతగా చేసే ఓ కీలకమైన పనిని చంద్రబాబు లగడపాటికి ఇచ్చే ఆలోచన చేస్తున్నారట. అదేంటో తెలుసుకోవాలంటే కాస్త ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాల్సిందే.
2004 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయినప్పుడు పార్టీ పరిస్థితి మీద అంచనా కోసం విరివిగా సర్వేలు చేయాలని చంద్రబాబు అనుకున్నారు. అయితే అందుకోసం అయ్యే ఖర్చు భరించడానికి అప్పటిదాకా పదవులు అనుభవించిన నేతలు ఎవరూ ముందుకు రాలేదు. కానీ ఏ రాజకీయ ఫలాపేక్ష లేకుండానే నారాయణ ఆ బాధ్యత,ఆర్ధిక భారం పంచుకోడానికి ముందుకు వచ్చారట. ఆ ప్రయాణం 2014 దాకా సాగింది. అందులో ఎన్నో ఇబ్బందులు. 2009 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయినప్పుడు అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి నారాయణ ని టార్గెట్ చేయడానికి ప్రయత్నించారు.
అన్ని ఇబ్బందులు తట్టుకుని నిలబడ్డ నారాయణకు 2014 లో అధికారం రాగానే బాబు మంత్రి పదవి ఇచ్చింది అందుకే. అయితే మంత్రి అయ్యాక ఆ సర్వే విభాగాన్ని నిర్వహించడం నారాయణకు అదనపు పని భారం అయ్యింది. ఇక కుమారుడి మరణం తర్వాత పైకి గంభీరంగా ఉన్నప్పటికీ ఆయన బాగా డీలా పడ్డారు. అందుకే ఆ సర్వే విభాగపు బాధ్యతల్ని ఆంద్ర ఆక్టోపస్ గా పేరుపడ్డ లగడపాటికి అప్పగించాలని సీఎం భావిస్తున్నట్టు సమాచారం. సర్వేల నిర్వహణలో పేరుపడ్డ లగడపాటి సేవల్ని బాబు ఇలా వాడుకోవాలని అనుకుంటున్నారట.
మరిన్ని వార్తలు: