Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు మీడియాలో పోటీ రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటికే ఉన్న ఛానెళ్లు టీఆర్పీల కోసం నానా తంటాలు పడుతుంటే… కొత్తగా మరో ఛానెల్ ఎన్నికల నాటికి రెడీ అవుతోంది. వైసీపీకి అనుకూల ఎన్నారై ఈ ఛానెల్ పెడుతున్నారు. మీడియా సపోర్ట్ టీడీపీకి ఉండటం, సాక్షికి జగన్ ఛానెల్ గా ముద్రపడటంతో.. కొత్త ఛానెల్ పెట్టాలని డిసైడయ్యారట.
దీంతో ఈసారి ఎన్నికలు మరింత హీటెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ ఛానెళ్ల వార్ లో ఎవరు గెలుస్తారో చూడాల్సి ఉంది. టీడీపీ , వైసీపీ కంటే ఛానెళ్లే ఎక్కువగా ఎన్నికల్లో ఇన్వాల్వ్ అయి కొట్టుకుంటాయనే టాక్ నడుస్తోంది. గతంలో కూడా కొన్ని ఛానెళ్లు వైసీపీ అనుకూల సర్వేలు.. మరికొన్ని ఛానెళ్లు టీడీపీ అనుకూల సర్వేలు చేశాయి.
కానీ ఈసారి మాత్రం ఎన్నారై జగన్ ముద్ర కనిపించకుండానే.. చాప కింద నీరులా వైసీపీకి సపోర్ట్ చేయాలని డిసైడైపోయారు. జనాలకు అది జగన్ ఛానెల్ అని తెలిసేలోపే ఎన్నికలు ముంచకొచ్చేలా ముహూర్తం కూడా ఫిక్స్ చేశారట. చూడబోతే ఈసారి జగన్ అన్ని వైపులా మోహరించి మరీ సీఎం సీటు కోసం స్కెచ్ వేస్తున్నట్లే కనిపిస్తోంది.
మరిన్ని వార్తలు: