Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నంద్యాల ఉప ఎన్నికల ఫలితం చూసాక అయినా వైసీపీ అధినేత జగన్ ఆత్మశోధన చేసుకుంటారని భావించిన వారికి షాక్ తగిలింది. ఓటమి ఖరారైన గంటల్లోనే జగన్ మళ్లీ నోటికి పనిచెప్పారు. నంద్యాల అపజయం మీద మాట్లాడేందుకు ప్రెస్ ముందుకు వచ్చిన జగన్ అంతా అనుకున్నట్టే సాకులు చెప్పారు. చంద్రబాబు ఈ ఎన్నికల్లో 200 కోట్లు ఖర్చుపెట్టారని జగన్ ఆరోపించారు. పైగా వివిధ పద్ధతుల్లో జనాన్ని చంద్రబాబు బెదిరించారని, అందుకే నంద్యాల ఓటర్లు టీడీపీ కి ఓటు వేశారని జగన్ అన్నారు. నంద్యాల ఉప ఎన్నిక ఫలితం రెఫరెండం కాదని జగన్ అభిప్రాయపడ్డారు. వైసీపీ నుంచి టీడీపీ కి వెళ్లిన 20 మంది మందితో రాజీనామా చేయించి ఆ స్థానాల్లో గెలిస్తే అప్పుడు రెఫరెండం అవుతుందని జగన్ అన్నారు.
జగన్ చెప్పిన ఈ సాకులు సహజంగా ఓడిపోయిన వాళ్ళు ఎవరైనా చెప్పేదే. అధికార పార్టీకి సహజంగా ఉప ఎన్నికల్లో కొంత ఎడ్జ్ ఉంటుంది. అంత వరకు మాట్లాడి ఉరుకుంటే బాగుండేది. కానీ జగన్ ఇంకో అడుగు ముందుకెళ్లి నంద్యాలలో టీడీపీ విజయం సాధించింది అనుకుంటే చంద్రబాబు కన్నా మూర్ఖుడు లేడు అని వ్యాఖ్యానించి తనకున్న నోటి దురుసు ఇంకో సారి ప్రదర్శించారు. ఈ ప్రెస్ మీట్ చూసాక జగన్ మారతాడని దింపుడు కళ్లెం ఆశలతో ఎదురు చూసేవాళ్ళు కూడా ఆ ఆలోచన మానుకోవడం ఖాయం.
మరిన్ని వార్తలు: