Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఉప ఎన్నికలు దగ్గర పడుతుండటంతో నంద్యాల లో ప్రచారం ఊపందుకుంది. వైసీపీ అద్యక్షుడు జగన్ నంద్యాల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎన్నికలో శిల్పామోహన రెడ్డి ని గెలిపించాలని కోరిన జగన్ ఆయనకు వేసే ప్రతి ఓటు తనకు వేసినట్టేనని అన్నారు. చంద్రబాబు మూడున్నరేళ్ల పాలనలో సంపాదించిన అవినీతి సొమ్మను నంద్యాలలో ఖర్చుపెడుతున్నారని జగన్ విమర్శించారు. మూడున్నరేళ్లలో బాబు మూడున్నర లక్షల కోట్లు సంపాదించారని జగన్ ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో రైతు, డ్వాక్రా రుణాల మాఫీ, నిరుద్యోగ భృతి వంటి ఎన్నెన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు…అవేవీ నెరవేర్చలేదని, ఇప్పుడు మళ్లీ నంద్యాలలో కొత్త హామీలు ఇస్తున్నారని జగన్ మండిపడ్డారు.
ఉప ఎన్నికలో న్యాయానికి, ధర్మానికి ఓటు వేయాలని ఆయన నంద్యాల ప్రజలను కోరారు. ఏడాదిన్నరలో జరగబోయే మహా సంగ్రామానికి ఉప ఎన్నిక నాంది పలకబోతోందన్నారు. మరోవైపు ప్రచారం ఇలా సాగుతోంటే నంద్యాలలో పరిస్థితులు మాత్రం మరోలా ఉన్నాయి. ఓటర్లకు డబ్బు పంపిణీ చేసేందుకు స్థానిక నేతలు కొందరు ప్రయత్నాలు ప్రారంభించింది. డైరెక్ట్ గా డబ్బు పంపిణీకి పోలీసు నిఘా అడ్డువస్తుందనే కారణంతో మహిళల ఖాతాలకు డబ్బులు పంపిణీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. నియోజక వర్గంలో మహిళల ఖాతాల వివరాలను సేకరిస్తున్నారు. ఖాతాల ద్వారా డబ్బు పంపిణీ చేసి మహిళా ఓటర్లను తమ వైపుకు తిప్పుకోవాలని భావిస్తున్నారు. ఈ విషయాన్ని అధికార టీడీపీ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. అధికార పార్టీ 1500 కోట్ల నిధులను నియోజకవర్గానికి ఖర్చుపెడుతున్నామని చెప్పి ప్రచారం చేస్తోంటే…పోటీలో ఉన్న మరో పక్షం మాత్రం ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి ఉప ఎన్నికలో గట్టెక్కాలని ప్రయత్నిస్తోంది.
మరిన్ని వార్తలు: