Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎన్ని విమర్శలు వచ్చినా…ఎన్ని అపజయాలు ఎదురైనా వైసీపీ అధినేత జగన్ తీరు మారడం లేదు. పాదయాత్ర కి ముందు శ్రీవారి దర్శనం కి తిరుమల వెళ్లిన ఆయన అక్కడ వ్యవహరించిన తీరు మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇలా విమర్శలు వస్తాయని తెలిసి కూడా జగన్ శ్రీవారి ఆలయంలో కనీస మర్యాదలు పాటించకుండా, బయటికి వచ్చి స్వామీజీల దగ్గర మాత్రం ఎక్కడలేని గౌరవ ప్రపత్తులు పాటించడాన్ని వైసీపీ శ్రేణులే జీర్ణించుకోలేకపోతున్నాయి.
టీటీడీ సిబ్బంది తో పాటు పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర రెడ్డి దర్శనానికి వెళ్లే ముందు హిందూ ధర్మం మీద గౌరవం ఉందని డిక్లరేషన్ ఫామ్ ఇవ్వమని అడిగినా జగన్ ఏ మాత్రం పట్టించుకోలేదు. పైగా ఆ సమయంలో జగన్ బాడీ లాంగ్వేజ్ కాస్త అసహనంగా కనిపించింది. అయితే జగన్ కావాలని దాన్ని బయటపడకుండా కవర్ చేయడం అందరికీ అర్ధం అవుతూనే వుంది. ఇక శ్రీవారి ప్రసాదం కూడా ఆయన తీసుకోలేదన్న విషయం కూడా బయటికి వస్తోంది.
సరే మొదటినుంచి క్రైస్తవాన్ని పాటించిన అలవాటు కదా ఈ సంప్రదాయాలు పాటించడం ఇబ్బందిగా అనిపించింది అనుకోడానికి వీల్లేకుండా శారద పీఠాధిపతి స్వరూపానంద, శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి దగ్గర జగన్ ఏ స్థాయిలో పాద నమస్కారాలు చేస్తున్నారో కనిపిస్తూనే వుంది. వారు చెప్పినట్టు పూజలు, ఇతరత్రా మత సంబంధ అంశాల్ని పాటిస్తున్నారు. ఇక ఆయన అధికారంలోకి రావాలని సుదీర్ఘ చండీ యాగం కూడా నిర్వహిస్తున్నారు. అధికారం కోసం ఇన్ని చేస్తున్న జగన్ తిరుమల శ్రీవారి ఆలయంలో డిక్లరేషన్ ఇవ్వకుండా ఏమి సంకేతం ఇవ్వదలిచారో ? . ఆయన ఉద్దేశం ఏదైనా సామాన్యులకి మాత్రం శ్రీవారి కన్నా ఈ స్వాముల మీదే జగన్ కి ఎక్కువ నమ్మకం ఉన్నట్టు కనిపిస్తోంది.