Posted [relativedate] at [relativetime time_format=”
అనుమతి లేని పాదయాత్ర కి సిద్దమైన ముద్రగడని నిలువరించడానికి ఏపీ సర్కార్ తీసుకున్న చర్యల్ని తప్పుబడుతూ వైసీపీ అధినేత జగన్ ఓ ట్వీట్ వేశారు. చంద్రబాబూ ఇది తప్పు అంటూ కాపులకి ఇచ్చిన హామీ అమలు చేయమనే కదా వాళ్ళు అడుగుతోందని కామెంట్ చేశారు. కానీ జగన్ గారికి ఈ విషయం 2014 ఎన్నికల టైం లో ఏ మాత్రం గుర్తు లేదు. అప్పుడు అసలు కాపు అన్న మాటే మీ నోట రాలేదు. ఇప్పుడైనా నోరు తెరిచి నేరుగా కాపులకి రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అని మీరు పోరాడడం లేదు సరి కదా అడగడం లేదు. జస్ట్ మీ సూచనలు, సలహాలతో నడుచుకుంటున్న ముద్రగడని ఇబ్బంది పెట్టొద్దు అంటున్నారు. సరే కాపుల మీద మీ ప్రేమ నిజమే అనుకుందాం అనుకుంటే తాజాగా సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఓ జాబితా చూస్తే అదీ శుద్ధ అబద్ధమని తేలిపోయింది.
2019 ఎన్నికలకి సంబంధించి వైసీపీ అభ్యర్థుల తొలి జాబితా ఇప్పటికే రెడీ అయ్యిందట. ఆ జాబితానే ఇప్పుడు సోషల్ మీడియా లో హల్ చెల్ చేస్తోంది. ప్రస్తుతం వైసీపీ కి మిగిలిన 46 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 30 మందికి సీట్లు ఖరారు చేసినట్టు వైసీపీ శ్రేణులే చెప్పుకుంటున్నాయి. ఆ శ్రేణులు బయటపెట్టిన జాబితా ప్రకారం మొత్తం 30 మందికి గాను 19 మంది జగన్ సొంత సామాజిక వర్గానికి చెందినవారు. ఇప్పుడు మీరు చెబుతున్న ఆ కాపుల్లో ఒకే ఒక్క అభ్యర్ధికి తిరిగి సీట్ ఇచ్చారు. అంటే తొలి జాబితా చూస్తే జగన్ సామాజిక వర్గానికి ఒక్కదానికే 63 శాతం టిక్కెట్లు కేటాయించినట్టు. మిగిలిన అన్ని కులాలకు కలిపి మూడింట ఒక వంతు టిక్కెట్లు అయితే, ఒక్క రెడ్డి సామాజిక వర్గానికి మూడింట రెండు వంతుల సీట్లా ? ఇదెక్కడి న్యాయం ? ఇంకెక్కడి సామాజిక న్యాయం ? చంద్రబాబూ ఇది తప్పు అని చెప్పే ముందు మనం చేసేది కూడా ఓ సారి వెనక్కి తిరిగి చూసుకుంటే బాగుంటుంది జగన్ గారూ. ఇదిగో అందుకే మీ తొలి జాబితా అంటూ వైసీపీ అనుకూల సోషల్ మీడియా ఇచ్చిన దాన్నే మళ్లీ ఇస్తున్నాం. కావాలంటే చూసుకోండి.
1. విశ్వరాయి కళావతి – పాలకొండ (శ్రీకాకుళం)
1. పాముల పుష్పా శ్రీవాణి – కురుపాం (విజయనగరం)
3. కే రాజన్నదొర – సాలూరు (విజయనగరం)
4. బి. ముత్యాల నాయుడు – మాడుగల (విశాఖపట్నం)
5. దాడిశెట్టి రాజా – తుని (తూగో జిల్లా)
6. చిర్ల జగ్గిరెడ్డి – కొత్తపేట (తూగోజిల్లా)
7. కొడాలి నాని – గుడివాడ (కృష్ణా జిల్లా)
8. ఆళ్ల రామకృష్ణారెడ్డి – మంగళగిరి (గుంటూరు)
9. కోనా రఘుపతి – బాపట్ల (గుంటూరు)
10. ముస్తాఫా – గుంటూరు ఈస్ట్ (గుంటూరు)
11. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి – మాచర్ల (గుంటూరు)
12. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి – నరసారావు పేట (గుంటూరు)
13. ఆర్ ప్రతాప్ కుమార్ రెడ్డి – కావలి (నెల్లూరు)
14. అనిల్ కుమార్ యాదవ్ – నెల్లూరు సిటీ (నెల్లూరు)
15. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి – నెల్లూరు రూరల్ (నెల్లూరు)
16. కాకాణి గోవర్థన్ రెడ్డి -సర్వేపల్లి
17. కోరుముట్ల శ్రీనివాసులు – కోడూరు (కడప)
18. గడికోట శ్రీకాంత్ రెడ్డి – రాయచోటి (కడప)
19. రాచమల్లు ప్రసాద్ రెడ్డి – ప్రొద్దుటూరు (కడప)
20. వైఎస్ జగన్మోహన్ రెడ్డి – పులివెందుల (కడప)
21. ఎక్కలదేవి ఐజయ్య – నందికొట్కూరు (కర్నూలు)
22. గౌరు చరితా రెడ్డి – పాణ్యం (కర్నూలు)
23 .బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి – డోన్ (కర్నూలు)
24. వై సాయి ప్రసాద్ రెడ్డి – ఆధోని (కర్నూలు)
25. వై విశ్వేశ్వర్ రెడ్డి – ఉరవకొండ (అనంతపురం)
26. చింతల రామచంద్రారెడ్డి – పీలేరు (చిత్తూరు)
27. దేశాయి తిప్పారెడ్డి – మదనపల్లి (చిత్తూరు)
28. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి – పుంగనూరు (చిత్తూరు)
29. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి – చంద్రగిరి (చిత్తూరు)
30. ఆర్కే రోజా – నగరి (చిత్తూరు)
మరిన్ని వార్తలు