Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాజకీయాల్లో కులం, మతం ఎలాంటి ప్రభావం బహిరంగ రహస్యమే . కానీ వాటిని వాడుకుని ఓటు వేయించుకునేవాడికి, వాటిని చూసి ఓటు వేసేవాడికి ఎంత తేడా ఉంటుందో మాత్రం అరుదుగా అనుభవంలోకి వస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆ సీన్ కళ్లారా చూసే అవకాశం దక్కింది.
2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర తలపెట్టారు. ఆ యాత్ర కి ముందు ఆశీస్సుల కోసం తిరుమల శ్రీవారి ని దర్శించుకున్నారు జగన్. శ్రీవారి దర్శనం తరువాత నేరుగా విశాఖ వెళ్లి శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర ని కలిసి ఆయన మంగళాశాసనం తీసుకున్నారు. ఇక పాదయాత్ర ఆలోచన రాగానే జగన్ ముందుగా కలిసింది కూడా శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామినే. ఓ పెద్ద కార్యం తలపెట్టినప్పుడు ఇలా తాము నమ్మే దేవుడి ఆశీస్సులు తీసుకోవడం కొత్తేమీ కాదు. కానీ ఇది నిజంగా శ్రీవారి మీద నమ్మకమా అనుకోవడానికి వీల్లేదు. ఇదే జగన్ మాత్రమే కాదు ఆయన కుటుంబ సభ్యులు సైతం కిందటి ఎన్నికల సమయంలో ఏ గుడిలో కనిపించలేదు. చేత బైబిల్ పట్టి ప్రతి చోట దర్శనమిచ్చేవారు. అప్పుడు చేతిలో బైబిల్ మీద విమర్శలు వచ్చినా పట్టించుకోని వాళ్ళు ఇప్పుడు ఆ ఊసు కనపడకుండా వ్యవహరించడం చూస్తుంటే ఎన్నికల దృష్టితో జగన్ అండ్ ఫామిలీ ప్రభువుకి బ్యాక్ బెంచ్ వేస్తున్నట్టు ఉందన్న విమర్శలు వస్తున్నాయి.
ఇంత హిందూ ఓట్ల కోసం ఇంత హడావిడి చేస్తున్న జగన్ తిరుమలలో ఏమి చేసాడో తెలుసా అన్య మతస్తులు శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు తాము వేరే మతం అనుసరిస్తున్నప్పటికీ హిందూ ధర్మం మీద గౌరవంతో దర్శనానికి వచ్చినట్టు ఓ డిక్లరేషన్ ఇవ్వాలి. దానికి సంబంధించిన ఫామ్ తీసుకుని వచ్చిన సిబ్బందిని లెక్కచేయకుండా జగన్ ముందుకు వెళ్లిపోయారు. అప్పుడు ప్రభువు అయినా ఇప్పుడు శ్రీవారు అయినా అవసరార్ధమే అన్న విషయంలో జగన్ కి ఫుల్ క్లారిటీ వుంది. కానీ అలాంటి నేతలు పాటించే పద్ధతులు చూసి ఓటు వేసే జనమే ఆలోచించుకోవాలి.