Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నంద్యాల ఉపఎన్నికల ఫలితాలతో దింపుడు కళ్లెం ఆశలు కూడా వదిలేసుకున్న వైసీపీ నేతలు తట్టాబుట్టా సర్దుకుని వేరే పార్టీల వైపు తొంగి చూస్తున్నారు. అలా తొంగి చూస్తున్న వాళ్లలో జగన్ కి కుడిభుజం లాంటి నేత పేరు వినిపిస్తోంది. ఆయనే రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అని సమాచారం. మరో 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలతో సహా ఆయన టీడీపీ తీర్ధం పుచ్చుకోడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఇందుకు సంబంధించి సీక్రెట్ గా డీల్ సెట్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
జగన్ వ్యవహారశైలి మీద కొన్నాళ్లుగా శ్రీకాంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో వున్నాడట. ఒంటెత్తు పోకడలు తగవని ఎంత చెప్పినా జగన్ వినడంలేదన్న ఆవేదనతో ఉన్న ఆయన నంద్యాల ఫలితం తర్వాత నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇక అభివృద్ధిపరంగా చూసినా త్వరలో హంద్రీనీవా, గాలేరు నగరి, గండికోట ప్రాజెక్టులు పూర్తి కాబోతున్నాయి. దీంతో రాయచోటి నియోజకవర్గానికి పుష్కలంగా నీళ్లు వస్తాయి. ఇది కూడా శ్రీకాంత్ రెడ్డి నిర్ణయానికి ఇంకో కారణమట. ఈ పరిస్థితుల్లో అటు రాజకీయంగా ఇటు అభివృద్ధిపరంగా వైసీపీ లో కొనసాగి ప్రయోజనం లేదని శ్రీకాంత్ అనుకుంటున్న తరుణంలో ఇదే అదనుగా సీఎం రమేష్ ఎంట్రీ ఇచ్చి ఆ లాంఛనం పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారట. అదే జరిగితే జగన్ కి రాయలసీమలో ముఖ్యంగా సొంత జిల్లా కడప లో కోలుకోలేని దెబ్బ తగులుతుంది.
మరిన్ని వార్తలు: